High Blood Pressure Drinks: ప్రస్తుతం చాలా మందిలో అధిక రక్తపోటు లేదా రక్తపోటు సమస్యలు రావడం సర్వసాధరణం. అయితే ఇలాంటి సమస్యలు వస్తే దాని ప్రభావం తీవ్రంగా గుండెపై పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గుండె పోటు, మధుమేహం, మూత్రపిండాలలో తీవ్ర సమస్యలు వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ రక్త పోటు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల రక్త పోటు సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటును నివారించడానికి వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
1. కొబ్బరి నీరు:
కొబ్బరి నీరులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో సోడియంను ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
2. బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్‌లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభించి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారికి ఔషధంలా పని చేస్తుంది.
3. దానిమ్మ రసం:
దానిమ్మల్లో విటమిన్లు, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. అయితే వాటి నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
4. టమోటా రసం:
టమోటాలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని పచ్చిగా తినడం లేదా రోజూ 1 గ్లాసు జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత
Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. వైరల్ పిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి