Sunflower Oil Health Benefits: సన్ ఫ్లవర్ సీడ్స్ దీనిని తెలుగులో పొద్దు తిరుగుడు గింజలు అని పిలస్తారు. ఇవి సన్ ఫ్లవర్ పువ్వులోని గింజల వస్తాయి. ఈ గింజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో పాటు గింజల నూనె కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
సన్ ఫ్లవర్ ఆయిల్ గుండెకు ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ నూనె శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో బోలెడు ఆరోగ్యాలాభాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాలను బయటకుపంపించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇతర దీర్ఝకాలిక వ్యాధులకు దారి తీసే సమస్యల నుంచి కూడా ఇది రక్షిస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఇ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని వ్యాధి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
ఇది చర్మం వయస్సు ప్రక్రియను నెమ్మదిస్తుంది. అలాగే చర్మంపైన ఎలాంటి మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ జుట్టును పోషించడానికి సహాయపడుతుంది. జుట్టుకు ఇది మంచి మాయిశ్చరైజర్. ఇది జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు మెరిసేలా చేస్తుంది.
అంతేకాకుండా ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని విటమిన్ ఇ మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సీజన్ల్‌గా వచ్చే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఇది సహాయపడుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని విటమిన్ ఇ మెదడు పనితీరు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి, డిప్రెషన్ వంటి మానసిక క్షీణతకు దారితీసే పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు, కానీ దానిని మితంగా ఉపయోగించడం ముఖ్యం. ఏదైనా నూనె వలె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతాయి.
గమనిక: సన్‌ఫ్లవర్ ఆయిల్ రెండు రకాలుగా లభిస్తుంది రిఫైన్డ్, అన్‌రిఫైన్డ్ ఆయిల్‌గా.. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది, అంటే అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు అది విచ్ఛిన్నం కాదు. అయితే, రిఫైనింగ్ ప్రక్రియలో కొన్ని పోషకాలను తొలగిస్తుంది.
Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook