Skin Care: ఐస్ వాటర్ తో ఫేషియల్.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

Ice Water Facial : అందంగా కనిపించడానికి ఎన్నో ఫేషియల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎదుటి మనిషిని చూసినప్పుడు మొదటగా మనకి కనిపించేది వారి మోహమే. అలాంటి ముఖ చర్మం కాపాడుకోవడం కోసం ఎంతోమంది స్కిన్ కేర్ ట్రీట్ మెంట్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ డాక్టర్ దాకా వెళ్లకుండానే స్వయంగా మన ఇంట్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఐస్ వాటర్ తోనే ఫేషియల్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 11:11 PM IST
Skin Care: ఐస్ వాటర్ తో ఫేషియల్.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

Ice Facial : ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ దాదాపు అందరూ ఇంట్లో ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అందరి ఇంట్లో దొరికేది ఐస్ వాటర్. అయితే అలాంటి ఐస్ వాటర్ తోనే మనం ఫేషియల్ చేసుకోవచ్చు. సెలబ్రిటీలు సైతం బాగా ఇష్టపడే ఈ ఐస్ ఫేషియల్ గురించిన వివరాలు తెలుసుకుందాం. 

అసలు ఐస్ ఫేషియల్ అంటే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని అందులో ఐస్ ముక్కలు వేసి ఆ గిన్నెలో మన మొహాన్ని ముంచాలి. లేదా ఐస్ ముక్కలను ఒక గుడ్డలో చుట్టి ముఖంపై కాసేపు మర్ధన చేయాలి. దీనినే ఐస్ వాటర్ ఫేషియల్ అంటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రముఖ కాస్మెటిక్ హెల్త్ కేర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మైత్రి చాదర్ల మాట్లాడుతూ ఐస్ క్యూబ్స్ వల్ల మన శరీరంలో ఉండే మంట, నొప్పి తగ్గుతాయని వడదెబ్బ సమయంలో కూడా ఐస్ గడ్డతో మర్దన చేస్తే చాలా త్వరగా ఉపసవనం లభిస్తుంది అని అన్నారు. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ మెరుగు అయ్యేందుకు కూడా ఐస్ ముక్కలు బాగా ఉపయోగపడతాయట.

ఐస్ ఫేషియల్ వల్ల మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఐస్ ఫేషియల్ తరువాత అందరికీ రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది అని, మన చర్మం రిఫ్రెష్ అయినట్లు అనిపిస్తుంది అని అంటున్నారు. చర్మంపై పేరుకుపోయి ఉన్న సెబమ్ (జిడ్డు) వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఐస్ వాటర్ ఫేషియల్ చేస్తూ ఉండటం వల్ల ఈ రంధ్రాలు కూడా వాటి అంతట అవే పోయి చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. రాత్రి పడుకునే సమయంలో ఐస్ ఫేషియల్ చేయడం వల్ల మరుసటి రోజు ఉదయం ముఖం ఫ్రెష్ గా ఉంటుంది.

ముఖంపై ముడతలు కూడా పోవడానికి ఈ ఐస్ ఫేషియల్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఐస్ ఫేషియల్ వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది చర్మం లోపల ఉన్న సహజ తేమను కోల్పోయి పొడిబారి పోయే అవకాశం ఉంది. గజ్జి, తామర వంటి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఈ ఐస్ ఫేషియల్ కి దూరంగా ఉండటం మంచిది. ఎంత ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువసేపు మొహాన్ని ఐస్ వాటర్ లో పెట్టి ఉంచడం వల్ల చర్మం పొరలు దెబ్బతిని ఫ్రోస్ట్ బైట్ కి గురయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయంలో వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News