Smart Phone Addiction: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారా? అయితే ఇలా చేసి చూడండి.

Smart Phone Addiction in Children: పెరుగుతున్న టెక్నాలజీ తో పాటుగా విపరీతంగా పెరిగిన మరో విషయం ఏమిటి అంటే మొబైల్ ఫోన్స్ వాడకం. పెద్దలు అయితే ఏదో అవసరం ఉంది వాడుతున్నారు అనుకోవచ్చు కానీ ..ఇవి పిల్లలకు సైతం అడిక్షన్ గా మారుతున్నాయి

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 09:20 PM IST
Smart Phone Addiction: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారా? అయితే ఇలా చేసి చూడండి.

Reduce Smart Phone Addiction: ఈ రోజుల్లో పిల్లలు గంటల తరబడి ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉంటున్నారు. పేరెంట్స్ వద్దని చెప్తే ఏడ్చేసి.. అరిచేసి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలో ఎలా వాళ్ల పిల్లల్ని  ఫోన్లను చూడకుండా ఆపాలో అని తల పట్టుకుంటున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ వాడటం వలన పిల్లల ఆరోగ్యం ఏమవుతుందో వాళ్ల ప్రవర్తన ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని బాధతో పేరెంట్స్ సతమతమవుతున్నారు. అయితే వీటికి కొన్ని చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు సైకాలజిస్టులు.

తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైము తగ్గించడానికి కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందట. కొంతమంది పేరెంట్స్ బలవంతంగా మొబైల్ ని లాక్కుంటున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు కానీ వాళ్ళు ప్రవర్తనని మార్చుకోరు. ఇక కొంతమంది పేరెంట్స్ ఫోన్ వాడకం తగ్గిస్తే గిఫ్ట్ ఇస్తామని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు తగ్గించేది పక్కన పెడితే గిఫ్ట్ లకు అలవాటయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సిందేమంటే వాళ్ల టైం ను పిల్లలతో కేటాయించాలి అది ఎలా అంటే వంట పనిలో గాని తోట పనిలో గాని వాళ్ళని సహాయం చేయమని అడగండి. మీ పని ఈజీగా అవుతుంది.. అలానే వాళ్లు ఫోన్ చూడడం తగ్గించినట్టు అవుతుంది. 

ఫోను చూడటం వల్ల కలిగే దుష్ప్రభవాళ్ల గురించి పిల్లలకు చెప్పాలి. అదే విధంగా రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రభావాలు జరుగుతాయో వాటి గురించి పూర్తిగా వివరించండి. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి..  మెంటల్ గా ఎలా డిస్టర్బ్ అవుతారు అన్న విషయాన్ని వాళ్ళకి అర్థం అయ్యేలాగా వివరించాలి.

భోజనం చేసే సమయంలో చదువుకునే టైంలో  పడుకునే ముందు మాట్లాడుకునే సమయంలో వాళ్ళు ఫోన్లు వాడకం తగ్గించాలి. అది ఏ విధంగా అంటే ఫోను పాస్వర్డ్ పెట్టి.. అది వాళ్లకు తెలియనీయకుండా.. వాళ్లకు కావాల్సినపుడు మనమే ఓపెన్ చేసి ఇవ్వాలి. ఇలా పాటించారంటే కొంతవరకైనా పిల్లలు ఫోన్లు వాడకం తగ్గించవచ్చు. 

పేరెంట్స్ కూడా ఫోన్ పట్టుకొని చాలా సేపు ఫోన్లతో కేటాయిస్తుంటారు. కాబట్టి నిజంగా అంత అవసరం కానీ లేకపోతే పేరెంట్స్ కూడా ఆ ఫోన్ పక్కన పెట్టి.. పిల్లలతో కొంత సేపు  టైం కేటాయించండి లాంటివి చేస్తే తప్పకుండా పిల్లల కొన్ని చేంజెస్ ఉన్నాయి ఆ పిల్లకి అమ్మాయికి రాసి ఫోన్ వాడకం తగ్గించవచ్చు.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News