Vitamin K: విటమిన్-కే వల్ల బోలెడు ఉపయోగాలు.. ఎందులో దొరుకుంతుందో తెలుసా?

Vitamin K Rich Foods: మన శరీరం సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన విటమిన్లలో విటమిన్-కే కూడా ఒకటి. కాబట్టి మన శరీరం నుంచి విటమిన్ కే తగ్గకుండా చూసుకోవాలి. అంటే విటమిన్-కే ఎక్కువగా ఉందే ఆహారం తీసుకోవాలి. మరి విటమిన్ కే ఎలాంటి ఆహారంలో ఎక్కువగా ఉంటుందో తెలుసా?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 29, 2024, 02:54 PM IST
Vitamin K: విటమిన్-కే వల్ల బోలెడు ఉపయోగాలు.. ఎందులో దొరుకుంతుందో తెలుసా?

Vitamin K Foods: విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-ఈ లాంటి ఎన్నో విటమిన్ల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ శరీరం సరిగ్గా పని చేయడంలో ఉపయోగపడే ఇతర విటమిన్లలో.. విటమిన్-కే కూడా చాలా ముఖ్యమైనది. విటమిన్ కే కారణంగానే మన శరీరం.. మనల్ని కాపాడగలదు. 

ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా.. అక్కడి నుంచి రక్తం ఎక్కువగా బయటకుపోకుండా.. రక్తం గడ్డ కట్టడానికి, ఎక్కువ రక్తస్రావం జరగకుండా ఉండటానికి.. విటమిన్ కే మనకి బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో విటమిన్-కే తక్కువ అయితే, చిన్న దెబ్బ తగిలినా కూడా రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనకి తెలియకుండానే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మిగతా విటమిన్లతో పాటే విటమిన్-కే ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవటం, మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్నిసార్లు డాక్టర్లు విటమిన్ కే టాబ్లెట్లు కూడా వాడాలి అని సజెస్ట్ చేస్తారు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా మనమే సరైన పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది.  

విటమిన్-కే లభించే ఆహార పదార్థాలు:

విటమిన్-కే లో రెండు రకాలు ఉంటాయి ఒకటి విటమిన్ కే1, మరొకటి విటమిన్ కే2. రెండిటి వల్ల ఉపయోగాలు ఒకటే అయినప్పటికీ విటమిన్ కే1 ఎక్కువగా ఆకుకూరల్లో కనిపిస్తుంది. విటమిన్ కే2 మాత్రం కోడిగుడ్లు, మీట్, డైరీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. 

బ్రోకలీ లో విటమిన్ కే1 చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరల్లో కూడా విటమిన్ కే1 ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే1 పాటు ఆకుకూరల్లో.. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి కూడా దండిగా ఉంటాయి. 

ఆకుకూరలు మాత్రమే కాక కోడిగుడ్లలో కూడా విటమిన్-కే ఎక్కువగా లభిస్తుంది. ఒకవేళ నాన్ వెజ్ తినని వారు ఉంటే.. వారు ఎక్కువగా స్ట్రాబెరీస్ తినడం వల్ల కూడా విటమిన్-కే ను అందుకోవచ్చు. ఇక నానబెట్టిన సోయాబీన్స్ తో చేసే నాటోలో కే2 ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఉండే చీజ్ లో కూడా విటమిన్ కే2 ఎక్కువ శాతం లో లభిస్తుంది.

కాబట్టి విటమిన్-కే డెఫిషియన్సీ రాకుండా ఈ ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా రుచికరమైన ఆహారం తీసుకుంటూనే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News