Jackfruit Benefits: ఎండాకాలం అంటే మామిడి పళ్ళు అందరికీ గుర్తొస్తాయి.. కానీ కొంతమందికి పనస పండు మాత్రమే గుర్తొస్తుంది. పండ్ల రారాజు మామిడిపండ్ల వాళ్ళ మాత్రమే కాక.. పనసపండ్ల వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పనస పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఈ ఎండాకాలం అయిపోయేదాకా రోజూ పనస పండ్లు తినాలని అనుకుంటారు.
గుండె ఆరోగ్యం:
పనస పండులో ఎక్కువగా ఉండే పొటాషియం. మన శరీరంలో సోడియం స్థాయిని నియంత్రిస్తుంది. దానివల్ల గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుగా జరగడంతో.. హైపర్ టెన్షన్ నియంత్రణలోకి వస్తుంది.
క్యాన్సర్ కి నివారణ:
పనసపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో.. ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్ తో పోరాడి, ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. క్యాన్సర్‌కు కారకం అయిన టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండూ శరీరంలో నుండి తొలగిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
ఎముకలకు బలం:
పనస పండులో ఉండే కాల్షియం మన ఎముకలకి.. ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పనస పండు లో ఎక్కువగా ఉండే కాల్షియం.. మన ఎముకలను దృఢంగా చేస్తాయి.
ఆస్తమా పేషెంట్స్ కి మందు:
పనస పండులో ఉండే పోషకాలు, విటమిన్స్, ఆస్తమా ఎటాక్స్ ని కూడా నియంత్రిస్తాయి..అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్తమాకి కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ ను పనసపండు తొలగిస్తుంది. ఆ విధంగా చూస్తే ఆస్తమా పేషెంట్స్ కి పనసపండు మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు.
కంటి చూపు:
పనస పండులో ఉండే విటమిన్ ఏ మన కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఏ మన కళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా మన శరీరాన్ని కూడా యూవీ కిరణాలు, హానికరమైన కాంతి తరంగాల నుంచి కాపాడుతుంది. రెటీనా క్షీణతను నియంత్రిస్తూ కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
థైరాయిడ్ పేషెంట్స్ కి దివ్య ఔషధం:
పనస పండులో ఎక్కువగా ఉండే కాపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లకి ఉపయోగపడుతుంది. హార్మోన్ ఉత్పత్తి, సోషణ విషయంలో కూడా పనస పండు కీలక పాత్ర పోషిస్తుంది. పనస పళ్ళలో ఉండే ఖనిజ లవనాలు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
అధిక బరువు:
అధిక బరువు ఉన్నవాళ్లు కూడా ఎటువంటి భయం లేకుండా పనస పళ్ళను తినవచ్చు. పనస పళ్లలో దొరికే ఇనుము శాతం మన శరీరంలో రక్తహీనత ను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు పనస పళ్ళను తినడం వల్ల త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా పనసపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా వేడి చేసేలా తినకుండా పనస పండును కూడా మితంగా తింటే కేవలం దాని నుండి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ఎంజాయ్ చేయచ్చు.
Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్ పే నంబర్ అంటూ పిచ్చి రాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter