Baby Food Preparation In Home: పిల్లల కోసం బేబీ ఫుడ్స్ కొనడం ఆపేయండి.. ఇంట్లో సెర్లాక్ ఎలా చేయాలంటే..!

Baby Food Recipe: ఈమధ్య కాలంలో బయట ఆహారాన్ని నమ్మడానికి లేదు. ఎందులో ఏమీ కలుపుతున్నారో కూడా తెలియడం లేదు. మన ఆరోగ్యం ఎలా ఉన్నా మన పిల్లల విషయంలో మాత్రం మనం అలాంటి ఆహారాన్ని కొంచెం కూడా నమ్మలేము. అందుకే పిల్లల కోసం మనం ఇంట్లోనే చాలా సులువుగా సెర్లాక్ పొడి చేసుకోవచ్చు. చక్కగా మూడు నెలలు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 28, 2024, 07:44 PM IST
Baby Food Preparation In Home: పిల్లల కోసం బేబీ ఫుడ్స్ కొనడం ఆపేయండి.. ఇంట్లో సెర్లాక్ ఎలా చేయాలంటే..!

Home Made Baby Food Recipe  :  ఈమధ్య బేబీ ఫుడ్స్ లో కూడా ఏవో రసాయనాలు కలుపుతున్నారని, ఉండాల్సిన దానికంటే ఎక్కువ పంచదారను చేరుస్తున్నారని ఇలా ఎన్నో నివేదికలు బయటకు వస్తున్నాయి. వాటిని చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. డబ్బులు పెట్టి మరి బయట నుంచి కలుషితమైన ఆహారాన్ని కొనే బదులు, మన ఇంట్లో మనమే చేసి పిల్లలకి తినిపిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.

మన ఇంట్లో మనమే స్వయంగా రాగులతో సెర్లాక్ పౌడర్ చేసి మూడు నెలలు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఈ సెర్లాక్ పౌడర్ తయారు చేయడం చాలా ఈజీ. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పిల్లల ఆరోగ్యం కంటే తల్లిదండ్రులగా మనకి కావాల్సింది ఇంకేముంటుంది. కాసేపు వారి కోసం సమయం కేటాయించి సెర్లాక్ పౌడర్ చేసుకుంటే మూడు నెలలు పాటు హాయిగా వాడుకోవచ్చు. 

రాగులతో బేబీ సెర్లాక్ కి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు రాగులు, అరకప్పు బియ్యం, గుప్పెడు బాదం పప్పులు, 1/4 కప్పు పెసరపప్పు. 

ముందుగా రాగులు, బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఎక్కడైనా నీడగా ఉన్నచోట ఆరబెట్టాలి. వాటి తడి ఆరిపోయాక వాటిని పక్కకు తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బాదంపప్పుతో పాటు ఈ మూడిటిని కూడా వేసి వేయించుకోవాలి.

అది బాగా వేగాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే టెస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదైన సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయినట్లే. దీనిని గాలి చొరపడని ఒక స్టీల్ లేదా గాజు డబ్బాలో దాచుకోవాలి. 

ఇక ఆ పొడి తో సెర్లాక్ కలపడం కూడా సులువుగానే అయిపోతుంది. ముందుగా రెండు స్పూన్ల సెర్లాక్ పొడి నీటిలో వేసి కలపాలి. ఆ నీటిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. కొంచెం ఉప్పు వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేసి, పావు స్పూన్ నెయ్యి కూడా వేసి, గోరువెచ్చగా అయ్యాక పిల్లలకు తినిపించవచ్చు.

ఈ సెర్లాక్ పౌడర్ మన చేతులతో స్వయంగా మనమే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రెజర్వేటివ్స్ ఇందులో ఉండవు. కాబట్టి పిల్లలకి ఎలాంటి హాని జరగదు. ఒకవేళ పిల్లలకి ఏదైనా తియ్యగా తినడం నచ్చుతుంది అంటే పంచదార బదులు బెల్లాన్ని చేర్చి ఇవ్వడం మంచిది. తెల్లగా ఉండే బెల్లం కన్నా కొంచెం నల్లగా ఉండే బెల్లాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇక గానుగ బెల్లం అయితే పిల్లల ఆరోగ్యానికి ఏ డోఖా ఉండదు. 

అయితే చిన్నప్పుడు నుంచి తీపి అలవాటు చేయకూడదు అని అనుకునే తల్లిదండ్రులు తీపి కి బదులుగా చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇలా సులువుగా మన ఇంట్లో మనమే రాగులతో సెర్లాక్ చేసుకుని పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

Also read: Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News