Vitamin B12 Side effects: విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..

Vitamin B12: ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు చాలా అవసరం. ఇందులో విటమిన్ బి-12 కూడా ఒకటి. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, వీటిని అధిక మెుత్తంలో తీసుకోవడం అన్నే దుష్ప్రభావాలు ఉన్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 05:11 PM IST
Vitamin B12 Side effects: విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..

Vitamin B12 Side effects: మన శరీరానికి విటమిన్లు చాలా అవసరం. బాడీ పనితీరు బాగుండాలంటే విటమిన్లు మరియు ఖనిజాలు అవసరమవుతాయి. ఇందులో విటమిన్ బి-12 కూడా ఒకటి. ఇది ఎక్కువగా మీట్ మరియు సీ పుడ్ లో దొరుకుతుంది. వీటితోపాటు సప్లిమెంట్స్ కూడా అవసరం. అయితే శరీరంలో విటమిన్ బి12 ఎక్కువైనా డేంజరే. ఈ సప్లిమెంట్లను అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల మీరు కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోంటారు. అవేంటో తెలుసుకుందాం. 

విటమిన్ బి-12 దుష్ప్రభావాలు
అతిసారం- మీ శరీరంలో విటమిన్ బి 12 అధికంగా ఉండటం వల్ల విరేచనాలు ఎక్కువగా అవుతాయి. అంతేకాకుండా మీరు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోనున్నారు.
చర్మంపై దురద- శరీరంలో విటమిన్ B12 ఎక్కువైతే మీ చర్మంపై దురద లేదా దద్దుర్లు వస్తాయి. 
మైకం-బాడీలో విటమిన్ B12ను అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల నిరంతరంతో మైకంతో బాధపడతారు. 
అలెర్జీ-విటమిన్ B12 సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అలెర్జీకి గురవుతారు. అంతేకాకుండా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. 
నిద్రలేమి- విటమిన్ B12 స్థాయిలు ఎక్కువైతే నిద్రలేమి సమస్యలను ఎదుర్కోంటారు. 
మానసిక సమస్యలు- ఈ విటమిన్ ఎక్కువ మెుత్తంలో తీసుకోవడం వల్ల మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. 
>>విటమిన్ బి12 స్థాయిలు పెరగడం వల్ల అలసట, వాపు, జలదరింపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. అంతేకాకుండా ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు కూడా వస్తాయి.

Also Read: Immunity Boosting: రోగనిరోధక శక్తిని పెంచి, ఆర్యోగంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!

Also Read: Foods To Control Bad Cholesterol: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News