Walking Benfits: మీకెవ్వరికీ తెలియని టాప్ 10 వాకింగ్ ప్రయోజనాలు, తెలిస్తే ఆశ్చర్యపోతారు

Walking Benfits: ఆరోగ్యం మహా భాగ్యమన్నారు పెద్దలు. ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లలో ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే వెంటనే గుర్తొచ్చేది వాకింగ్. వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్‌సైజ్ అని మనందరికీ తెలుసు. కానీ వాకింగ్‌తో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 10:07 AM IST
Walking Benfits: మీకెవ్వరికీ తెలియని టాప్ 10 వాకింగ్ ప్రయోజనాలు, తెలిస్తే ఆశ్చర్యపోతారు

Walking Benfits: ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే వాకింగ్ మొదలెట్టాల్సిందేనంటారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఓ గంటసేపు వాకింగ్ అనేది జీవితంలో మీరు చేయగలిగే బెస్ట్ ఎక్సర్‌సైజ్ కాగలదు. ఎందుకంటే కొన్ని రకాల జిమ్ వర్కవుట్స్ అందరూ చేయలేరు. అందుకే వాకింగ్ సరైన ప్రత్యామ్నాయం. రోజుకు కనీసం అరగంట నడిచినా 150-200 కేలరీలు బర్న్ అవుతాయంటే అతిశయోక్తి కానే కాదు. రోజుకు అరగంట నుంచి గంట వాకింగ్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి పది ప్రయోజనాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం..

1. రోజూ వాకింగ్ చేయడం వల్ల మీ వెస్టిబ్యులర్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. అంటే వాకింగ్ చేస్తుంటే మీ శరీరంలోని ఎగువభాగం నియంత్రణలో ఉండి బాడీ సామర్ధ్యం పెరుగుతుంది. 

2. శారీరక వ్యాయామం అనేది జీవిత కాలాన్ని పెంచుతుంది. వివిధ పరిశోధనల ప్రకారం మనిషి సరాసరి జీవిత కాలం 78 ఏళ్లు అయితే..రోజూ వాకింగ్ చేయడం ద్వారా 90 ఏళ్ల వరకూ జీవించవచ్చంటున్నారు పరిశోధకులు. అందుకే రోజూ కనీసం అరగంట లేదా గంట వ్యాయామం చేయడం చాలా అవసరం. 

3. వాకింగ్ అనేది శరీరం సామర్ధ్యాన్ని పెంచుతుంది. సామర్ధ్యం పెరిగే కొద్దీ శరీరం వివిద రకాల ఇన్‌ఫెక్షన్లు , క్రిములను ఎదుర్కొనే శక్తిని పొందుతుంది. ఎందుకంటే వాకింగ్ వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాలు, లింఫోసైట్స్ స్టిమ్యులేట్ అయి ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

4. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల ప్రమాదకర వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు సమస్యల్నించి దూరం కావచ్చు.

5. రోజూ వాకింగ్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ బాడీ పోశ్చర్ మారుతుంది. అంటే స్టిఫ్‌గా నిటారుగా ఉండేట్టు చేస్తుంది. వయసు రీత్యా సంభవించే వదులుతనం ఉండదు. వాకింగ్ చేయడం వల్ల నాడి కణాలు ఒకదానికొకటి బాగా కనెక్ట్ అవుతుంటాయి.

6. రోజూ వాకింగ్ చేయడం వల్ల మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అంటే శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కాళ్లు,చేతులు ఇలా అన్ని అంగాలకు రక్తం సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా అన్ని భాగాలకు ఆక్సిజన్ అంది ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

7. రోజూ వాకింగ్ చేసే అలవాటుంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటాయని పలు అద్యయనాల్లో వెల్లడైంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులకు డాక్టర్లు కూడా రోజూ వాకింగ్ చేయమనే సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బాడీలో విడుదలయ్యే రసాయనాలు మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. 

8. వాకింగ్ ఎంత మంచి అలవాటంటే రోజూ మీ శరీరంలో అదనంగా ఉండే కేలరీలు కరిగిపోతాయి. రోజుకు కనీసం అరగంట వాకింగ్ చేస్తే 150-200 కేలరీలు కచ్చితంగా బర్న్ అవుతాయి. 

9. వాకింగ్ అనేది మీ శరీరంలో తరచూ ఎదురయ్యే జాయింట్ పెయిన్స్ సమస్యను తగ్గిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం రోజూ వాకింగ్ చేయడం వల్ల మోకాలి కార్టిలేజ్ 12 వారాల్లో రికవర్ అయినట్టుగా తెలుస్తోంది. ఆస్టియో ఆర్ధరైటిస్ రోగులకు వాకింగ్ మంచి ప్రత్యామ్నాయం.

10. రోజు వారీ బిజీ లైఫ్ నుంచి కాస్సేపు విరామం లేదా బ్రేక్ తీసుకోవాలంటే వాకింగ్ బెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మూడ్ బూస్టర్ హార్మోన్ ఎండార్ఫిన్ విడుదలవుతుంది. రోజూ వాకింగ్ చేసేవాళ్లు ఇతరులతో పోలిస్తే ఆనందంగా ఉండగలరు.

Also read: Vitamin K: రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు, విటమిన్ కే లోపిస్తే ఊపిరితిత్తుల సమస్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News