Legs Tingling: కాళ్లు తిమ్మిరెక్కుతుంటే నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు

Legs Tingling: శరీరంలో జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. కాళ్లలో తిమ్మిర్లు ఎక్కడం వంటి లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఈ లక్షణం గంభీరమైన వ్యాధికి సంకేతం కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2023, 11:30 PM IST
Legs Tingling: కాళ్లు తిమ్మిరెక్కుతుంటే నిర్లక్ష్యం వద్దు, ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు

Legs Tingling: వయస్సుతో సంబంధం లేకుండా కొంతమందికి కాళ్లలో తిమ్మిర్లు ఎక్కడం జరుగుతుంటుంది. లేదా కాళ్లలో ఏదో పాకుతున్నట్టుగా అన్పిస్తుంటుంది. సాధారణంగా డయాబెటిస్ లక్షణమనుకుంటారు చాలామంది. కానీ ఇతర గంభీరమైన వ్యాధి లక్షణం కావచ్చు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యులు.

శరీరంలో నెర్వ్ దెబ్బతినడమంటే చాలా గంభీరమైన పరిస్థితిగా చెప్పవచ్చు. నరం దెబ్బతిన్నప్పుడు కాళ్లలో తిమ్మిరి ఎక్కడం లేదా ఏదైనా పాకుతున్నట్టు అన్పించడం జరుగుతుంటుంది. ఈ సమస్యను ప్యారేస్థీషియా అంటారు. ఈ సమస్య తలెత్తినప్పుడు కాళ్లు తిమ్మిరెక్కుతుంటాయి. లేదా కాళ్లలో సత్తువ కోల్పోయినట్టుగా అన్పిస్తుంది. చాలామంది డయాబెటిస్ వ్యాధి లక్షణంగా తేలిగ్గా తీసుకుంటారు. కానీ నరం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్య ఇది. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కాళ్లలో తిమ్మిరెక్కడానికి కారణమేంటో తెలుసుకుందాం..

హైపోథైరాయిడిజమ్

థైరాయిడ్ గ్లాండ్ తగినంత హార్మోన్ ఉత్పత్తి చేయనప్పుడు హైపో థైరాయిడిజమ్ సమస్య ఉన్నట్టుగా పరిగణిస్తారు. హార్మోన్ లోపముంటే కాళ్లలో తిమ్మిరి లేదా ఏదో పాకుతున్నట్టు ఉంటుంది. మీక్కూడా ఈ సమస్య ఉంటే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.

కిడ్నీ సమస్య

కిడ్నీ వ్యాధి ఉంటే..మజిల్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఫలితంగా చేతులు తిమ్మిరెక్కడం లేదా పట్టు కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. మీ కాళ్లకు ఇదే సమస్య ఉంటే కిడ్నీ వ్యాధిగా అనుమానించాల్సిందే. 

డయాబెటిస్ సమస్య

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు సాధారణంగా కాళ్లు తిమ్మిరెక్కడం ప్రధానంగా కన్పిస్తుంది. శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగితే నరాలు బలహీనమై ఈ పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఈ లక్షణం ఎప్పుడు కన్పించినా నిర్లక్ష్యం చేయవద్దు.

విటమిన్ బి12 లోపం

నరాల పటుత్వానికి దోహదపడే అతి ముఖ్యమైన విటమిన్ ఇది. శరీరంలో విటమిన్ బి 12 లోపిస్తే కాళ్లు తిమ్మిరెక్కడం సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరానికి విటమిన్ బి12 చాలా అవసరం. ఎక్కువగా ఈ విటమిన్ మాంసాహారంలో సమృద్ధిగా లభిస్తుంది. 

Also read: Body Pain Causes: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉంటే..నిర్లక్ష్యం మంచిది కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News