Liver Disease Symptoms: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైన అంగం. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది కాస్తా ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
లివర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో లివర్ డ్యామేజ్ అవుతున్నా ఏం తెలియకుండా ఉంటుంది. ముఖ్యంగా లివర్‌పై కొవ్వు పేరుకుంటున్నప్పుడు ఏ మాత్రం తెలియదు. అయితే కొన్ని సూక్ష్మమైన, సాధారణ లక్షణాలను బట్టి లివర్‌లో సమస్య ఉందని గుర్తించవచ్చు. తద్వారా వెంటనే చికిత్స చేయించుకోవచ్చు.
శరీరంలో లివర్ డ్యామేజ్ అయితే ముందుగా కన్పించే లక్షణం తీవ్రమైన అలసట. అంటే ఏ చిన్న పని చేసిన అలసటకు గురవుతుంటారు. అంతేకాకుండా లివర్‌లో సమస్య ఉంటే ఆకలి మందగిస్తుంది. మీక్కూడా ఆకలి వేయకపోయినా లేదా ఏదీ తినాలన్పించకపోయినా లివర్ సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. మరో ముఖ్య లక్షణం తరచూ వికారంగా ఉండటం, వాంతులు వస్తుండటం గమనించవచ్చు. చాలామందిలో భోజనం చేసిన వెంటనే వికారంగా ఉండటం లేదా వాంతులవడం ఉంటుంది. ఇది లివర్ సమస్యకు సంకేతమే.
లివర్ ఆరోగ్యంగా లేకపోతే కడుపు, కాళ్లు వాచిపోతాయి. ఎందుకంటే లివర్ పనితీరు మందగించి నీటిని నిల్వ చేస్తుంది. దాంతో కడుపు ఉబ్బిపోయి కన్పిస్తుంది. ఇది మంచిది కాదు. తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. లివర్ వ్యాధిలో మరో ముఖ్య లక్షణం కళ్లు, చర్మం పచ్చగా మారడం. అంటే జాండిస్ వ్యాధి రావడం. తరచూ మద్యం తీసుకునేవారితో పాటు తీసుకోనివారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు కడుపు కుడివైపు మంట, నొప్పి ఉంటాయి.
లివర్ అనారోగ్యంగా ఉంటే మూత్రం రంగులో మార్పు వస్తుంది. సాధారణ రంగులో కాకుండా పచ్చగా లేదా మరే ఇతర రంగులో మూత్రం వస్తుందంటే లివర్‌లో సమస్య ఉందని గుర్తించవచ్చు. చర్మంపై దురద ఒక్కటే కాకుండా దద్దుర్లు కూడా వస్టుంటే లివర్ సమస్య ఉందని అర్ధం. లివర్ వ్యాధి సోకినప్పుడు క్రానిక్ తలనొప్పి బాధిస్తుంది. అంటే ఈ కేసులో తలనొప్పి తీవ్రంగా ఉండటమే కాకుండా తగ్గకుండా ఉంటుంది.
లివర్ సమస్య ఏర్పడినప్పుడు శరీరంలోని హార్మోనల్ లెవెల్స్‌లో మార్పు వస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం, మొటిమలు వంటివి స్పష్టంగా కన్పించవచ్చు. ఇక మరో ముఖ్య లక్షణం మలబద్ధకం. లివర్‌లో సమస్య ఏర్పడితే జీర్ణక్రియపై ప్రభావం పడి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. లివర్ అనేది మనిషి శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను క్లీన్ చేసే అతి ముఖ్యమైన పని చేస్తుంది.
Also read: Ragi Biscuits: ఎగ్ లెస్ రాగి బిస్కెట్స్ రెసిపీ..టేస్ట్ లో అదుర్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook