Jogging Health Benefits: ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి. లేదా రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ జాగింగ్ అనేది అవసరం. రోజుకు అరగంట వాకింగ్‌కు కేటాయించడం అంటే పెద్ద కష్టమైన పనేం కాదు. గంటల కొద్దీ సెల్ ఫోన్‌లలో గడిపే బదులు ఓ అరగంట వాకింగ్ చేస్తే అటు ఆరోగ్యం ఇటు ఫిట్నెస్ రెండూ ఉంటాయి.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకించి ఆధునిక జీవన విధానంలో హెల్తీగా ఉండేందుకు ఉదయం వేళ వ్యాయామం లేదా వాకింగ్ చేయమని వైద్యులు సూచిస్తుంటారు. జాగింగ్ అంటే ఓ విధంగా స్లో రన్నింగ్ లాంటిది. రోజూ ఇలా చేయడం వల్ల కార్డియో వాస్క్యులర్ యాక్టివిటీ అద్భుతంగా మెరుగుపడుతుంది. రోజూ నిద్ర లేవగానే కనీసం ఓ అరగంట జాగింగ్ చేస్తే చాలంటున్నారు వైద్యులు.
రోజూ క్రమం తప్పకుండా జాగింగ్ చేయడం వల్ల శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనిషి శరీరంలో యాంటీ బాడిస్, తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో చాలా రకాల ఇన్‌ఫెక్షన్స్ దూరమౌతాయి. ముఖ్యంగా ఫ్లూ, జలుబు, దగ్గు వంటివి దరిదాపుల్లో చేరవు. రోజూ నియమిత సమయంలో జాగింగ్ చేయడం వల్ల హార్ట్ , లంగ్స్ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే వ్యాయామం కారణంగా కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ బలోపేతమౌతుంది. గుండె కండరాలు పటిష్టంగా మారతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది.
రోజూ నిర్ణీత సమయంలో జాగింగ్ చేయడం అనేది శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచడంలో దోహదం చేస్తుంది. జాగింగ్ కారణంగా మానసిక ఆరోగ్యం లభిస్తుంది. జాగింగ్ చేసినప్పుడు ఎండోఫిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీనినే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. మనిషి మూడ్‌ను సెట్ చేస్తుంది. ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
ఇక రోజూ జాగింగ్ చేయడం వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. మనిషి ఫిట్ అండ్ స్లిమ్ అండ్ హెల్తీగా ఉంటాడు. రోజూ జాగింగ్ చేసినప్పుడు పెద్దమొత్తంలో కేలరీలు బర్న్ అవుతుంటాయి. బరువు నియంత్రణలో ఉంచేందుకు ఇది మంచి విధానం. రోజూ ఓ అరగంట జాగింగ్ చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోజుకు కనీసం 300-400 కేలరీలు బర్న్ కాగలవు.
Also read: Skin Problems: చలికాలం వచ్చిందంటే ఈ చర్మ సమస్యలు తప్పడం లేదా, ఈ రెమిడీస్ ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook