Healthy Breakfast: బలమైన ఇమ్యూనిటీ కావాలంటే రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవల్సిందే

Healthy Breakfast: మనిషి ఆరోగ్యానికి ప్రధానంగా కావల్సింది ఇమ్యూనిటీ మాత్రమే. రోగ నిరోధక శక్తి బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. మరి ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2023, 12:38 PM IST
Healthy Breakfast: బలమైన ఇమ్యూనిటీ కావాలంటే రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవల్సిందే

Healthy Breakfast: సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కావల్సింది హెల్తీ ఫుడ్. తినే ఆహారం ఆరోగ్యంగా ఉంటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైందిగా ఉండాలంటారు వైద్య నిపుణులు. 

మనిషి రోజు ప్రారంభమయ్యేది బ్రేక్‌ఫాస్ట్‌తోనే. బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉంటే రోజంతా యాక్టివ్‌గా ఉండగలం. అందుకే నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. చాలామంది యువత బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఉదయం వేళ రుచికరమైన, పౌష్ఠిక అల్పాహారం తినాల్సిందే. బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటుంటారు. ఇది ఆరోగ్యపరంగా పలు సమస్యలు తెచ్చిపెడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజంతా పనికొచ్చే అత్యవసరమైన ఆహారం అని చెప్పవచ్చు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి. చెత్త పదార్ధాలు తీసుకోకూడదు. వీలైనంతవరకూ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎనర్జిటిక్ ఫుడ్ ఉంటే మంచిది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎలాంటి ఆహారం మంచిదో తెలుసుకుందాం..

దాలియాను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా చాలామంది న్యూట్రిషియనిస్టులు సిఫారసు చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్స్ ఉంటే చాలా మంచిది. మిల్లెట్స్‌తో చేసే దాలియా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓవరాల్‌గా చెప్పాలంటే మిల్లెట్స్ తో చేసే దాలియా ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. సాధారణంగా దాలియా అనేది గోధుమలతో తయారు చేస్తారు. కానీ మిల్లెట్స్‌తో చేసే దాలియా రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. దీంతోపాటు ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మిల్లెట్స్ దాలియా ఎలా తయారు చేయాలో చూద్దాం..

అర కప్పు మిల్లెట్స్ అవసరం. ఈ అరకప్పు మిల్లెట్స్‌ను నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్‌లో ఒక కప్పు నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిల్లెట్స్ వేయాలి, 4-5 విజిల్స్ వరకూ ఉంచాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో ఒకటిన్నర కప్పు పాలు తీసుకుని ఇందులో ఉడికిన మిల్లెట్ల్ వేయాలి. పైన కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయవచ్చు. ఆ తరువాత పాలలో కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. రుచి కోసం ఇందులో బెల్లం లేదా పంచదార వేసుకోవచ్చు. సర్వే చేసేముందు గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుంది. ఇమ్యూనిటీ బలంగా ఉండేందుకు మిల్లెట్స్ దాలియా అద్బుతంగా పనిచేస్తుంది. 

Also read: Weight loss Tips: ఓవర్ ఈటింగ్, బరువు తగ్గించలేకపోతున్నారా..ఈ టిప్స్ పాటించండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News