Health Tips: రోజూ రాగి అంబలి డైట్‌లో ఉంటే లెక్కలేనన్ని లాభాలు, మధుమేహానికి చెక్

Health Tips: ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఓల్డ్ ఈజ్ బెస్ట్ అన్నట్టు పాతతరం తృణధాన్యాలు ఎప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఆ వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2023, 05:28 PM IST
Health Tips: రోజూ రాగి అంబలి డైట్‌లో ఉంటే లెక్కలేనన్ని లాభాలు, మధుమేహానికి చెక్

Health Tips: ఇటీవలి కాలంలో అందరికీ హెల్త్ కాన్సెస్ పెరిగింది. వివిధ రకాల ప్రకృతి వైద్య పద్ధతులని మళ్లీ ఆశ్రయిస్తున్నారు. పాతకాలం నాటి థాన్యాల్ని తిరిగి డైట్‌లో భాగంగా చేసుకుంటున్నారు. పాతతరం తృణ ధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అతి ముఖ్యమైనవి. ఇందులో ఇవాళ మనం తెలుసుకునేది రాగుల గురించి. 

రాగులు పాతతరమైనా ఇప్పటికీ వాడుకలో ఉంది. కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో రాగుల ఉపయోగం ఇప్పటికీ రాగి సంకటి, రాగి ముద్ద రూపంలో ఉంది. లేదా రోజూ వాకింగ్ లేదా వ్యాయామం పూర్తయ్యాక రాగి జావ తాగడం అలవాటుగా మారుతోంది. మొత్తానికి రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల పట్ల అందరిలో అవగాహన పెరుగుతోంది. రాగి సంకటి, రాగి ముద్ద లేదా రాగి అంబలి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గడమే కాకుండా శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది.

రాగుల్లో ఉండే ఎన్నో రకాల ప్రోటీన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రాగి అంబలి రోజూ తాగే అలవాటుంటే ఇందులో ఉండే ఫైబర్, గ్లైసీమియాతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ నిల్వల్ని పెంచుతుంది. మరోవైపు ఇందులో ఉండే మినరల్స్ , పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ కారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాల్ని, ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఏజీయింగ్ ప్రక్రియను అరికడుతుంది. 

ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాదులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని అరికడతాయి. ఎముకల సంబంధిత సమస్యలుండేవారికి రాగులు చాలా బలవర్ధకమైన ఆహారం. ఎందుకంటే ఇందులో కాల్షియం అదిక మొత్తంలో ఉంటుంది. 

Also read: Walnut Shells: వాల్‌నట్ షెల్స్ పడేస్తున్నారా, ఇలా చేసి వాడండి అన్ని రోగాలకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News