Curry Leaves & Pudina Leaves Weight loss tips: స్థూలకాయం అతి పెద్ద సమస్య. ఎందుకంటే ఈ ఒక్క సమస్యతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. కొంతమంది డైటింగ్ చేస్తే కొంతమంది వ్యాయామంపై ఆధారపడుతుంటారు. అయినా బరువు తగ్గించుకోలేకపోతుంటారు.
అయితే కొన్ని చిట్కాలతో అధిక బరువు సమస్య నుంచి సులభంగా విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ డైట్లో కొన్ని ఆకులు చేర్చాల్సి ఉంటుంది. బరువు తగ్గించుకునేందుకు ఈ ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. బరువు తగ్గించేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం..
పుదీనాతో కలిగే లాభాలు
అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పుదీనా ఆకులతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. తక్షణం పుదీనా ఆకుల్ని డైట్లో భాగంగా చేసుకోవాలి. పుదీనా ఆకలిని నియంత్రించే పనిచేస్తుంది. సులభంగా బరువు తగ్గించవచ్చు. పుదీనాలో ఉండే పోషక గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పుదీనా డ్రింక్ ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. లేదా ఇతర రూపాల్లో కూడా పుదీనా ఆకుల్ని సేవించవచ్చు.
Read More: Fennel Seeds: వేసవిలో సోంపు క్రమం తప్పకుండా తింటే కలిగే అద్భుత లాభాలివే
కరివేపాకు ప్రయోజనాలు
కరివేపాకు బరువు తగ్గించే ప్రక్రియలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేదే. మార్కెట్లో కూడా విరివిగా లభిస్తుంది. సాధారణంగా వంటల్లో రుచి కోసం కరివేపాకు వినియోగిస్తుంటారు. కానీ ఆరోగ్యపరంగా కరివేపాకుతో చాలా ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తీసుకోవాలి. దీనివల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
Also Read: Asthma Diet Tips: రోజూ ఈ పండ్లు తింటే చాలు ఆస్తమాకు ఇన్హేలర్ అవసరం కూడా రాదిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook