Diabetes Diet: ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కూడా జీవనశైలి వ్యాధులే. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. నియంత్రణ ఎంత సులభమో..నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరంగా మారుతుంది.
డయాబెటిస్ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆధారిత వ్యాధి. అందుకే మధుమేహం నియంత్రణకు మందులు వాడటంతో పాటు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది తెలుసుకోవాలి. వీలైతే తినాల్సిన ఆహార పదార్ధాల జాబితా తయారు చేసుకుని డైట్లో అవి మాత్రమే ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నవి, కేలరీలు అధికంగా ఉన్నవి డైట్లో లేకుండా చూసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ప్రమాదకరంగా మారవచ్చు.
డయాబెటిస్ సోకినవారికి అత్యంత కష్టమైంది డైట్ మాత్రమే. ఎందుకంటే తినే ప్రతి పదార్ధం విషయంలో కేర్ తీసుకోవాలి. ఆకు కూరలు సదా ఆరోగ్యానికి మంచివి. అందుకే ప్రతిరోజూ డైట్లో ఆకు కూరలు ఉండేట్టు చూసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మరీ ముఖ్యంగా క్యాబేజ్ ఎక్కువగా తినడం మంచిది. ఎందుకంటే ఇందులో శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్లు , యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కల్గిస్తాయి. క్యాబేజ్లో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలతో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది.
క్యాబేజ్ తరచూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు దూరమౌతాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు వంటివి తగ్గుతాయి. ఇక అధిక బరువుని తగ్గించేందుకు లేదా బరువు నియంత్రణలో ఉంచేందుకు క్యాబేజ్ బెస్ట్ ఫుడ్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకోదు. క్యాబేజీలో ఫైబర్‌తో పాటు ఆంథోసైనిన్, పోలీ ఫెనోల్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణ సంబంధిత సమస్యలుండవో మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటివి దూరమౌతాయి.
Also read: Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు ఖర్జూరం తినవచ్చా లేదా, వాస్తవమేంటి
దీంతోపాటు రోజూ కనీసం 30-40 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరి. దీనివల్ల అధికంగా ఉండే కేలరీలు కరిగి శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
Also read: High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఇవేనా? మీరు కూడా బరువు పెరుగుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook