Blackberry Fruits: ఈ ఒక్క పండు తింటే చాలు కేన్సర్, గుండెపోటు దరిచేరవు

Blackberry Fruits: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. శరీరానికి కావల్సిన వివిద రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఒకటి బ్లాక్ బెర్రీ లేదా క్వెర్‌సెటీన్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పండ్ల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2023, 01:58 PM IST
Blackberry Fruits: ఈ ఒక్క పండు తింటే చాలు కేన్సర్, గుండెపోటు దరిచేరవు

Blackberry Fruits: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు వివిథ రకాల పోషకాలు అంటే విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల కోసం మందులపై ఆదారపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయల్లోనే అన్నీ ఉంటాయి. ఇవాళ మనం క్వెర్‌సెటీన్ లేదా బ్లాక్ బెర్రీ పండ్ల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

క్వెర్‌సెటీన్ లేదా బ్లాక్ బెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇందులో సహజసిద్ధమైన ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మెరుస్తున్న పసుపు పచ్చ, పండ్లు కూరగాయల్లో కన్పిస్తాయి. బ్లాక్ బెర్రీస్, ఆపిల్, ఉల్లిపాలు, నల్ల ద్రాక్ష వంటివాటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే క్వెర్‌సెటీన్ అత్యంత కీలకం కానుంది. అయితే ఎక్కువగా ఉండకూడదు. క్వెర్‌సెటీన్ శరీరంలో పరిమితికి మించి ఉండటం మంచిది కాదు. 

క్వెర్‌సెటీన్ లేదా బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని వివిద అధ్యయనాల్లో తేలింది. ఇవి రక్త సరఫరాను మెరుగుపర్చేందుకు దోహదం చేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. బ్లాక్ బెర్రీలు తినడం వల్ల గుండె చాలా ఆరోగ్ంగా ఉంటుంది. గుండెకు అవసరమైన మినరల్స్ బ్లాక్ బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి.బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు తగ్గుతుంది. 

అన్నింటికంటే ముఖ్యంగా కేన్సర్ ముప్పు తగ్గుతుంది. రోజూ తగిన పరిమాణంలో బ్లాక్ బెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల కేన్సర్ ముప్పు చాలా వరకూ తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఎందుకంటే బ్లాక్ బెర్రీల్లో యాంటీ కేన్సర్ గుణాలుంటాయి. ప్రత్యేకించి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కేన్సర్ ప్రారంభంలో  ఎదగకుండా నియంత్రిస్తాయి.

బ్లాక్ బెర్రీ పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో ఎదురయ్యే ముప్పును తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తాయి. బ్లాక్ బెర్రీలతో ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయి. ఇవి కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా బ్లాక్ బెర్రీ పండ్లలో చాలా ఎక్కువ. దాంతో ఏ విధమైన ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. 

Also read: Healthy Foods: డైట్‌లో ఈ మూడు పదార్ధాలుంటే చాలు..లివర్ అద్భుతంగా పని చేస్తుంది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News