/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Sinus vs Cold: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తరచూ జలుబు, దగ్గు సమస్య పీడిస్తుంటుంది. ఒక్కోసారి 2-3 రోజులైనా తగ్గకుండా ఉంటుంది. దీర్ఘకాలం ఈ లక్షణాలు తగ్గకుండా వేధిస్తుంటే సైనస్ కావచ్చు. అయితే సాధారణంగా సైనస్, సాధారణ జలుబు మద్య అంతరాన్ని గుర్తించడం కష్టమౌతుంటుంది. సైనస్, సాధారణ జలుబు ఎలా ప్రత్యేకమో చూద్దాం..

సైనస్ అనేది ఓ సాధారణ సమస్య. ప్రస్తుత జనరేషన్‌లో ఇదొక సామాన్య సమస్య. లక్షలాదిమంది సైనస్ వ్యాదితో బాధపడుతుంటారు.సైనస్ అనేది పుర్రె ఎముకల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలతో ముక్కుతో అనుసంధానితమై ఉంటుంది. కళ్ల మధ్యలో నుదుటి కింద, ముక్కు, మెడ ఎముకల వెనుక ఉండే ఎయిర్ పాకెట్స్‌లో వచ్చే సమస్యను సైనస్ అంటారు. ఇప్పుడు చెప్పిన ఈ భాగాలకు ముక్కుకు మధ్య స్వెల్లింగ్ ఉంటే సైనసైటిస్ అంటారు.

సైనస్ చేసే ముఖ్యమైన పని కఫం ఉత్పత్తి చేయడమే. ముక్కు మార్గంలో మాయిశ్చరైజ్ చేయడం, శుభ్రం చేయడం చేస్తుంటుంది.పైన ఉదహరించిన సైనస్ పాయింట్లలో ఎలర్జీ, ఇన్‌ఫెక్షన్ లేదా మరే ఇతర కారణంతో స్వెల్లింగ్ ఏర్పడితే సమస్యగా మారుతుంది. సైనస్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే గంభీరం కావచ్చు.

సీజనల్ ఫ్లూ అనేది సాధారణంగా 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. అదే సైనస్ అయితే దీర్ఘకాలం ఉంటుంది. ఏదైనా పదార్ధంతో ఎలర్జీ ఉంటే హిస్టమిన్ అనే రసాయనం విడుదలై రియాక్షన్ కలగజేస్తుంది. ఫలితంగా తలనొప్పి, తుమ్ములు, ముక్కులో నీళ్లు కారడం కన్పిస్తుంది. అదే సైనస్ అయితే ముక్కు మార్గంలో స్వెల్లింగ్ ఉంటుంది. సైనసైటిస్‌కు ప్రదాన కారణం వైరస్ కావచ్చు. ఫలితంగా కఫం ఏర్పడి మీ సమస్య మరింతగా పెరుగుతుంది. సైనస్ ఉంటే కఫం దట్టంగా ఉంటుంది. క్రమంగా మీ శ్వాసలో దుర్వాసన వస్తుంది.సైనస్ ఇన్‌ఫెక్షన్ అనేది గొంతులో, కళ్లలో నొప్పిగా పరిణమిస్తుంది.

దగ్గు, దట్టంగా పచ్చగా కఫం ఏర్పడటం, ముక్కు కారడం, పంటి నొప్పి, ముక్కు క్లోజ్ అవడం, తలనొప్పి, గొంతులో గరగర, చెవి దగ్గర ఒత్తిడి, తేలికైన జ్వరం, ముఖం స్వెల్లింగ్, శ్వాసలో దుర్వాసన, వాసన, రుచి తగ్గిపోవడం అనేది సైనసైటిస్ లక్షణాలు.

వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ అనేది సైనసైటిస్ కారణాలుగా చెప్పవచ్చు. ముక్కు ఎముక వంకర కావడం, ముక్కులో స్వెల్లింగ్, ఎలర్జీ ఎక్కువగా ఉండటం, బలహీనమైన ఇమ్యూనిటీ వల్ల సైనస్ వస్తుంది. సైనస్ ఉన్నప్పుడు సకాలంలో చికిత్స చేయించాలి. నేసల్ స్ప్రే మంచి పరిష్కారం. ఫ్లూ షాట్ వేయించుకోవడమే కాకుండా పోషక పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎలర్జీ కల్గించే పదార్ధాలకు దూరం పాటిస్తూ యాంటీ హిస్టమిన్ మందులు వాడాలి.

Also read: Cholesterol Types: కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ట్రై గ్లిసరాయిడ్స్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఎంత ఉండాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health precautions with sinus and normal cold, what is the difference between sinus and cold how to identify and what are the sinus symptoms
News Source: 
Home Title: 

Sinus vs Cold: సైనస్‌ను ఎలా గుర్తించవచ్చు, సాధారణ జలుబుకు సైనస్‌కు తేడాలేంటి

Sinus vs Cold: సైనస్‌ను ఎలా గుర్తించవచ్చు, సాధారణ జలుబుకు సైనస్‌కు తేడాలేంటి, లక్షణాలెలా ఉంటాయి
Caption: 
Sinusitis ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sinus vs Cold: సైనస్‌ను ఎలా గుర్తించవచ్చు, సాధారణ జలుబుకు సైనస్‌కు తేడాలేంటి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 12, 2023 - 23:42
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
164
Is Breaking News: 
No
Word Count: 
331