Cholesterol Tips: ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అనేక ఇతర సమస్యలు వెంటాడుతాయి. అసలు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకడి ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. హెల్తీ సెల్స్ తయారీలో కొలెస్ట్రాల్ అవసరమౌతుంది. కానీ ఎక్కువైతే మాత్రం ప్రమాదకరం. అందుకే కొలెస్ట్రాల్ అనేది నియంత్రణలో ఉండటం చాలా అవసరం. శరీరంలో కొన్ని కారణాల వల్ల ఒక్కసారిగా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంటుంది. కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రాణం కూడా పోవచ్చు. అసలు శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది, కారణాలేంటో తెలుసుకుందాం..
కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాఫీ ఎక్కువగా తాగేవారికి కెఫీన్ నష్టాన్ని చేకూరుస్తుంది. కాఫీ తాగితే రక్తపోటు పెరుగుతుంది. రోజుకు 2 కంటే ఎక్కువ కప్పులు కాఫీ తాగే అలవాటుంటే అది ఏ మాత్రం మంచిది కాదని తెలుసుకోండి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ముందు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఒత్తిడికి, కొలెస్ట్రాల్‌కు మధ్య అవినాభావ సంబంధముంది. సైకలాజికల్ స్ట్రెస్ కారణంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకేసారి పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రావచ్చు. ఈ పరిస్థితుల్లో ముందుగా మీ మనసును శాంతపర్చుకోవాలి. యోగా ఇందుకు ఉపయోగపడుతుంది.
స్మోకింగ్ కారణంగా కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఎందుకంటే సిగరెట్లో ఉంటే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో ప్రవేశిస్తుంది. ఫలితంగా శరీరంలో కెటకోలమైన్ విడుదలౌతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందుకే స్మోకింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మందులు తరచూ లేదా ఎక్కువగా వాడేవారిలో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ మందులు, యాంటీ సైకోటిక్స్ మందులు ఇందులో ముఖ్యమైనవి.
Also read: Soda Side Effects: సోడాతో తస్మాత్ జాగ్రత్త, ఆరోగ్యానికి ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook