Mistakes While Taking Blood Sugar test for Diabetes Patients: డయాబెటిస్ అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోయింది. అందుకు తగ్గట్టే మార్కెట్‌లో భారీగా ఇన్‌స్టంట్ షుగర్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే టెస్ట్ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే..తప్పుడు రీడింగ్ వస్తుంది జాగ్రత్త..
ప్రపంచంలోని ప్రతిదేశంలో విస్తృతంగా కన్పించే ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. దాదాపు అందరికీ ఈ సమస్య ఉంటోంది. డయాబెటిస్ నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగినా లేదా తగ్గినా..అందుకు తగ్గ మందులు వాడటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రించడం చేయవచ్చు. అందుకే మార్కెట్‌లో గ్లూకోజ్ టెస్టింగ్ కిట్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. కచ్చితమైన రీడింగ్ కోసం అడ్వాన్స్ గ్లూకోమీటర్లు కూడా ఉన్నాయి. అయితే తరచూ చేసే కొన్ని తప్పుల వల్ల రీడింగ్ తప్పు చూపిస్తుంటుంది. టెస్ట్ చేసే సమయంలో చేసే తప్పుల కారణంగా రీడింగ్ తప్పుగా చూపించడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
బయటి వాతావరణాన్ని బట్టి కూడా గ్లూకోమీటర్ రీడింగ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాతావరణం పూర్తిగా చల్లగా లేదా వేడిగా ఉంటే రీడింగ్ తప్పుగా రావచ్చు. చలికాలంలో రీడింగ్ తక్కువగా, వేసవిలో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఈ రెండు కాలాల్లో షుగర్ టెస్ట్ చేసే సమయంలో ఉష్ణోగ్రత సమంగా ఉండే ప్రదేశంలో కూర్చుంటే మంచిది.
బ్లడ్ షుగర్ టెస్ట్ ఎప్పుడు చేసినా చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీ చేతికి ఉన్న దుమ్ము, మట్టి లేదా స్వీట్ ఏదైనా తగిలున్నా రీడింగ్‌పై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు టెస్ట్ చేయడానికి కాస్సేపటి క్రితం ఏదైనా తిని ఉంటే..ఆ పదార్ధం కొద్దిగా వేళ్లకు అంటుకుని ఉండి ఉండవచ్చు. తద్వారా రీడింగ్‌పై ప్రభావం పడవచ్చు. అందుకే టెస్ట్ చేసే సమయంలో చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
భోజనం లేదా ఏదైనా తిన్న వెంటనే బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే రీడింగ్ కచ్చితంగా ఎక్కువ చూపిస్తుంది. అందుకే భోజనం లేదా బ్రేక్‌ఫాస్ట్ లేదా మరేదైనా తిన్న వెంటనే ఎప్పుడూ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయకూడదు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook