Health Tips: తేనెలో డ్రైఫ్రూట్స్ కలిపి తింటే ఇక ఏ రోగమూ రాదంటే నమ్మగలరా, నమ్మశక్యం కాని లాభాలు

Health Tips: తేనెను ఆయుర్వేదంలో ఔషధంగా భావిస్తారు. తేనె వినియోగం ప్రాచీనకాలం నుంచి ఉన్నదే. తేనెలో డ్రైఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2023, 11:52 AM IST
Health Tips: తేనెలో డ్రైఫ్రూట్స్ కలిపి తింటే ఇక ఏ రోగమూ రాదంటే నమ్మగలరా, నమ్మశక్యం కాని లాభాలు

ప్రాచీన కాలం నుంచి తేనె వినియోగం నడుస్తోంది. ఆయుర్వేద శాస్త్రంలో తేనె ప్రస్తావన, లాభాల గురించి విపులంగా ఉంది. పూవుల్నించి తేనెటీగలు తయారు చేసే అద్భుతమైన పదార్ధమిది. ఇందులో ఉండే గుణాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..

తేనెలో డ్రైఫూట్స్ నానబెట్టి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది. డ్రైఫ్రూట్స్‌లో ఉండే ఎన్నో పోషక పదార్ధాలు ఆరోగ్యానికి ప్రయోజనకరం. రోజూ డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గంభీరమైన వ్యాధులు దూరమౌతాయి. తేనెలో డ్రైఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం..

హార్ట్ ఎటాక్ ముప్పు దూరం

కొన్ని ఆరోగ్యపరమైన అధ్యయనాల ప్రకారం తేనెలో డ్రైఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రెండింట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషక పదార్ధాల వల్ల గుండెకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. హార్ట్ ఎటాక్ ముప్పును చాలావరకూ తగ్గించడమే కాకుండా..సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాయి.

ఇమ్యూనిటీ బూస్టర్

శరీరానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. ముఖ్యంగా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పించేది ఇమ్యూనిటీనే. తేనె, డ్రైఫ్రూట్స్ వినియోగంతో ఇమ్యూనిటీ బలపడుతుంది. ఫలితంగా సంక్రమిత వ్యాధుల ముప్పు చాలావరకూ తగ్గిపోతుంది. 

జీర్ణక్రియలో..

జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు తేనె, డ్రైఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. రోజూ క్రమం తప్పకుండా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధ సమస్యలు దూరమౌతాయి. 

మెదడు సంబంధిత వ్యాధులు దూరం

డ్రైఫ్రూట్స్‌ను తేనెలో కలిపి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు సంబంధించిన చాలా సమస్యలు ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి చాలావరకూ తొలగిపోతాయి. 

తేనెతో కలిపి తినాల్సిన డ్రై ఫ్రూట్స్

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్మిస్, నట్స్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయి. ఈ డ్రైఫ్రూట్స్‌ను ముందు 2-3 గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఆ తరువాత వీటిని నీళ్ల నుంచి బయటకు తీసి..తేనెలో కనీసం 2-3 గంటలు నానబెట్టాలి. 

Also read: Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News