Vitamin E: విటమిన్ ఇ అందరూ వాడకూడదా, ఎవరెవరు దూరంగా ఉండాలి

Vitamin E: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం. ఈ మూడు అంశాలు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే తినే ఆహారం హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2024, 08:35 PM IST
Vitamin E: విటమిన్ ఇ అందరూ వాడకూడదా, ఎవరెవరు దూరంగా ఉండాలి

Vitamin E: శరీరానికి అవసరమయ్యే విటమిన్లలో అతి ముఖ్యమైంది విటమిన్ ఇ. చర్మ సంరక్షణలో అత్యద్భుతంగా పనిచేసే విటమిన్ ఇదే. చర్మ సంరక్షణలో విటమిన్ ఇ లాభాలు అనేకం కాబట్టే బ్యూటీ థెరపీలో విటమిన్ ఇను తప్పకుండా వినియోగిస్తారు. కొంతమంది మాత్రం విటమిన్ ఇ వినియోగం నుంచి దూరంగా ఉండాలి. 

చర్మ సంరక్షణ, బ్యూటీ కేర్‌కు విటమిన్ ఇ చాలా ప్రయోజనకరం. అందుకే విటమిన్ ఇను బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ ఇ అనేది అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. చర్మాన్ని యౌవనంగా, అందంగా  ఉంచడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇతో ఎన్ని ప్రయోజనాలున్నాయో లెక్కగట్టలేం. అదే సమయంలో కొంతమందికి మాత్రం ఇది మంచిది కాదు. 

విటమిన్ ఇ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మానికి హాని కల్గించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలుగుతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు, పింపుల్స్ వంటివి నిర్మూలించవచ్చు. విటమిన్ ఇ అనేది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మంలో తేమను కొనసాగేలా చేస్తుంది. ఫలితంగా ముఖం ఎప్పుడూ హైడ్రైట్‌గా ఉండి మృదుత్వం కొనసాగుతుంది. విటమిన్ ఇ అనేది ముఖంపై మచ్చలు, మరకలు తొలగించడంలో దోహదపడుతుంది. దాంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఉండే స్వెల్లింగ్ సమస్యను, చర్మంపై ఉండే మచ్చల్ని తొలగిస్తాయి. 

విటమిన్ ఇ అనేది సూర్య కిరణాల్నించి హాని కలగకుండా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ ఇ ముఖానికి అప్లై చేయడం వల్ల సన్‌స్క్రీన్ లోషన్‌లా పనిచేస్తుంది. విటమిన్ ఇ అనేది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ముఖంలో కొత్త కాంతి వస్తుంది. ఆక్సిజన్, పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా చేర్చడంలో ఉపయోగపడుతుంది. 

కొంతమందికి చర్మపరమైన సమస్యలుంటాయి. ముఖ్యంగా ఎగ్జిమా, సోరియాసిస్ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు విటమిన్ ఇ వినియోగించకూడదు. లేకపోతే మంట, దురద, ఇరిటేషన్ మరింత పెరగవచ్చు. మరోవైపు గర్భిణీ స్థ్రీలు, పాలిచ్చే తల్లులు కూడా విటమిన్ ఇ వాడకూడదు. రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగించవాళ్లు, కొలెస్ట్రాల్ మందులు వినియోగించేవాళ్లు కూడా విటమిన్ ఇ మందులు వాడకూడదు. ఈ సమస్యలున్నవాళ్లు తప్ప మిగిలినవారంతా విటమిన్ ఇ వినియోగించవచ్చు. విటమిన్ ఇ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. చర్మ సంరక్షణతో పాటు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

Also read: Liver Damage Symptoms: లివర్ పాడయితే గోర్లను చూసి చెప్పవచ్చా, ఎలాంటి లక్షణాలుంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News