/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Green Tea: గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ టీతో లాభాలు అనేకం. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే..

గ్రీన్ టీ ( Green Tea ) ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సన్నబడటానికి ఎక్కువగా గ్రీన్ టీ వాడుతుంటారు. అయితే గ్రీన్ టీ కేవలం డైటింగ్ కోసమే కాదు..ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమని తెలుసా మీకు. గ్రీన్ టీ  రోజూ సేవిస్తే..గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్‌కు అద్భుత పరిష్కారం

టైప్ 2 డ‌యాబెటిస్ ( Type 2 Diabetes ) ఉన్న‌వారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ ( kotekin) అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మనిషి శరీరం..కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రిస్తాయి.   ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. బ‌రువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ ( Insulin resistance ) త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది. దీంతో ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది. 

అలాగని అందరూ తీసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ( Gastric problem ), ఎసిడిటీ ( Acidity ), కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ ఓ దివ్యౌషధమే అనడంలో సందేహం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. గ్రీన్ టీ తరచూ సేవిస్తుంటే శరీరంలోని రోగ నిరోధక శక్తి కచ్చితంగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం చాలా అవసరం.

Also read: Vitamin C: విటమిన్ సి సమృద్ధిగా ఉంటే..కరోనా వైరస్ తరిమికొట్టవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Green tea will boost your immunity power, Know how it works
News Source: 
Home Title: 

Green Tea: గ్రీన్ టీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎలా పనిచేస్తుందో తెలుసా

Green Tea: గ్రీన్ టీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎలా పనిచేస్తుందో తెలుసా
Caption: 
Green tea ( file photo )
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Green Tea: గ్రీన్ టీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎలా పనిచేస్తుందో తెలుసా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, March 29, 2021 - 16:55
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
70
Is Breaking News: 
No