Raw Brinjal Benefits: అరెరే.. పచ్చి వంకాయలతో ఇన్ని లాభాలా..? 8 రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం

Green Brinjal for Weight Loss & Bad Cholesterol: క్రమం తప్పకుండా పచ్చి వంకాయలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్‌ సి లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో వంకాయను తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 12:08 PM IST
Raw Brinjal Benefits: అరెరే.. పచ్చి వంకాయలతో ఇన్ని లాభాలా..? 8 రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం

Green Brinjal Reduce Weight Loss & Bad Cholesterol: పచ్చి కూరగాయాల్లో చాలా మంది ఇష్టపడి తినేవాటిలో వంకాయాలు ఒకటి. గుత్తి వంకాయ, మసాల వంకాయ నోటికి ఎంతో రుచిని అందిస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇవి నోటికి రుచి అందించడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా వంకాయలను ఆహారంలో తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో పోషకాలతో పాటు ఫైబర్, పొటాషియం, విటమిన్ సి లభిస్తాయి. కాబట్టి ఆహారంలో వంకాయలను తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పచ్చి వంకాయలను తినడం వల్ల కలిగే లాభాలు:

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది:
అన్ని సీజన్స్‌లో పచ్చి వంకాయలు మార్కెట్‌లో లభిస్తాయి. తరచుగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వంకాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

బరువు తగ్గొచ్చు:
పచ్చి వంకాయలను సలాడ్స్‌లో తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో పీచు పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.

Also Read: Chia Seeds For Weight Loss: కాఫీలో చియా విత్తనాలు కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గడం ఖాయం!

గుండె సమస్యలు రాకుండా సంరక్షిస్తుంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్లయతో బాధపడేవారికి పచ్చి వంకాయ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పచ్చి వంకాయల్లో విటమిన్ సి లభిస్తుంది. దీంతో వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వంకాయ సలాడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News