Banana Face Pack Benefits: అరటి పండు ప్రజాదరణ పొందిన పండు. ఇది ఎంతో రుచికరంగా బోలెడు పోషకాలు కలిగిన పండు. అయితే అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాని కాంతివంతంగా తయారు చేస్తాయి. అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ చర్మానికి సహాయపడుతుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి.
అరటి పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని తేమగా ఉంచి, రుణాత్మక ప్రభావాల నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీరాడిక్స్ నుంచి రక్షిస్తుంది. అరటి పండులోని ఎంజైమ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఇందులో ఉండే పోటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటి పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను, చర్మ వాపులను తగ్గిస్తాయి. అయితే వారంలో రెండు సార్లు అరటిపండుతో తయారు చేసే ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం చాలా మంచిదని చర్మనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
అరటి పండుతో చేసే కొన్ని ఫేస్ ప్యాక్‌లు:
అరటి పండు + తేనె:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మెరిసేలా చేస్తుంది. చర్మాన్నికి తేమ చాలా అవసరం. లేదంటే చర్మం పొడిబారుతుంది దీని వల్ల చర్మం దెబ్బతింటుంది. తయారీ విధానం: ముందుగా అరటి పండును తీసుకొని మెత్తగా చేసి ఒక చెంచా తేనెను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
అరటి పండు + పెరుగు:
ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు, మరకలు తొలుగుతాయి. చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. తయారీ విధానం: ఒక అరటి పండును మెత్తగా చేసి రెండు చెంచాల పెరుగును కలిపి పేస్ట్ చేసుకోవాలి.15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
అరటి పండు + అవోకాడో:
అవోకాడో ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని అరటిపండుతో కలిపి తీసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంచుతుంది. దీని తయారు చేసుకోవడం కోసం అరటి పండు, అరటి అవోకాడోను మెత్తగా మాసి, రెండింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్‌ను ముఖం మొత్తం అప్లై చేసి 20-25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
అరటి పండు + నిమ్మరసం:
నిమ్మరసం చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని అరటిపండుతో కలిపి తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీని తయారు చేసుకోవడం కోసం అరటి పండులో అరటి నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసుకోవడం చాలా మంచిది.
ముఖ్యమైన విషయాలు:
ఫేస్ ప్యాక్ వేయాలన్నా ముందు చిన్న భాగంలో టెస్ట్ చేసి చూడాలి. టేస్ట్ చేసి తరువాత అలర్జీ ఉంటే వాడకూడదు. వారానికి 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్‌లు వేయవచ్చు.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా చర్మ సమస్య ఉంటే చర్మ వైద్యునిని సంప్రదించడం మంచిది.
Also read: Camphor: కర్పూరం బిల్లతో లాభాలెన్నో .. ఒళ్లు నొప్పులు మాయం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.