Drumstick Leaves Benefits: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా రోగాల నుంచి బాడీని రక్షించే ఆయుర్వేద గుణాలు కలిగిన ఆకు కూరలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆకు కూరలన్నింటిలో ముఖ్యంగా మునగ ఆకును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల సైతం దూరం చేసేందుకు సహాయపడుతుంది.
ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వారికి ఒకసారైన ఆహారంలో మునగ ఆకును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందిట. అంతేకాకుండా శరీర బరువుతో పాటు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా మలబద్దం వంటి సమస్యలతో బాధపడేవారు తపకపకుండా ఆహారంలో ఈ ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
మునగ ఆకు ప్రయోజనాలు:
బ్యాక్టీరియకు చెక్:
మునగ ఆకులో 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వర్షాల కాలంలో వచ్చే సీజన్ వ్యాధులు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఉపశమనం కలిగి స్తుంది. అతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని కాపాడుతాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మునగ ఆకులను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
గాయాలను నయం చేస్తుంది:
మునగ ఆకులో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎప్పుడైనా గాయాలైప్పుడు సులభంగా నయం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద గాయాలతో బాధపడేవారు ప్రతి రోజు మునగ లేత ఆకుల నుంచి తీసిన రసాన్ని పూయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఉబ్బసానికి చెక్:
మునగ ఆకులను ప్రతి రోజు నమిలి తింటే శరీరానికి బోలెడు లాభాలు కలగడమే కాకుండా ఆస్తమా వంటి సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు శ్వాసనాళాలు కూడా మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
మునగ లేత ఆకులును క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇందులో నియాజిమినిన్, ఐసోథియోసైనేట్స్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి మనులలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.
Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్లోకి Jio Bharat B2 మొబైల్..ఫీచర్స్, ధర వివరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter