Blood Pressure: డ్రాగన్ ఫ్రూట్స్‌తో డయాబెటిస్ 2 రోజుల్లో కంట్రోల్‌ అవ్వడం ఖాయం..

 Dragon Fruit For Blood Sugar: రక్తంలో చక్కెర, గ్లూకోజ్ పరిమాణాలు బూస్ట్‌ అయినప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపుతో ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 01:21 PM IST
Blood Pressure: డ్రాగన్ ఫ్రూట్స్‌తో డయాబెటిస్ 2 రోజుల్లో కంట్రోల్‌ అవ్వడం ఖాయం..

Dragon Fruit For Blood Sugar: రక్తంలో చక్కెర, గ్లూకోజ్ పరిమాణాలు పెరిగినప్పుడు డయాబెటిస్ సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి పోషకాలు ఇచ్చే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. అయితే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడాని ఆరోగ్య నిపుణులు సూచించి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి పోషకాలు అందించే డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే మధుమేహంతో పాటు ఈ అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

బ్లడ్ షుగర్ స్థాయిని డ్రాగన్ ఫ్రూట్ నియంత్రిస్తుందా..?:
డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక రకమైన కాక్టస్ జాతి చెంది పండు. ఇది ఆసియా దేశాలల్లో థాయిలాండ్ ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఊబకాయాన్ని కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ప్రీడయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్‌ బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది.

మధుమేహం కారణంగా చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అయితే ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు ఇవే:
>>డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

>>ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియను సులభతరం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

>>డ్రాగన్ ఫ్రూట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తింటే గుండె సంబంధింత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

>>ఇందులో యాంటీ ఏజింగ్స్‌ కూడా ఉంటాయి. పొడి చర్మం, మొటిమల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.

Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా

Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News