Papaya For Sugar Levels: బొప్పాయి, తీపి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు. ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తినడం మంచిదేనా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దీని వల్ల షుగర లెవల్స్ పెరుగుతాయా? దీని డయాబెటిస్ ఉన్నవారు ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలు:
బొప్పాయి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. బొప్పాయిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బొప్పాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సాధారణంగా మధుమేహం ఉన్నవారు మితంగా బొప్పాయిని తినవచ్చు.
పరిమాణం ముఖ్యం: బొప్పాయిలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి, చిన్న మొత్తంలో తీసుకోవడం మంచిది. ఒక సమయంలో అర కప్పు బొప్పాయి తినడం సాధారణంగా సురక్షితంగా ఉంటుంది.
ఆహారంతో కలిపి తినండి: బొప్పాయిని అల్పాహారం లేదా భోజనంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా తగ్గిస్తుంది.
పచ్చి బొప్పాయిని ప్రయత్నించండి: పచ్చి బొప్పాయిలో పండిన బొప్పాయి కంటే చక్కెర తక్కువగా ఉంటుంది.
బొప్పాయి రసం తాగవచ్చు: కానీ రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది కాబట్టి, మొత్తాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. బొప్పాయి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా మారుతున్నాయో గమనించండి.
బొప్పాయితో పాటు మీరు తినే ఇతర ఆహారాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. మీరు మధుమేహం మందులు తీసుకుంటున్నట్లయితే బొప్పాయి వాటితో సంకర్షణ చెందే అవకాశం ఉంది. బొప్పాయి, మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఎంపికగా కనిపిస్తుంది. అయితే ఏదైనా ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. ఈ విధంగా బొప్పాయి తినే ముందు జాగ్రత్తలు పాటించండి. అలాగే మితంగా తీసుకోవడం చాాలా మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ జ్ఞానం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు సంబంధించి మీ వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి