Radish Side Effects: ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, విటమిన్ సి వంటి గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సమస్య పడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా సహాయపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది Brassicaceae కుటుంబానికి చెందినది, ఇందులో క్యాబేజీ, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి ఇతర ఆరోగ్యకరమైన కూరగాయలు కూడా ఉన్నాయి. ముల్లంగి యొక్క శాస్త్రీయ నామం Raphanus sativus.
ముల్లంగి రకాలు:
ఎర్ర ముల్లంగి: ఇది అత్యంత సాధారణ రకం, ఇది గాఢ ఎరుపు రంగులో ఉంటుంది.
తెల్ల ముల్లంగి: ఇది లేత తెల్లటి రంగులో ఉంటుంది మరియు ఎర్ర ముల్లంగి కంటే తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది.
ఆసియా ముల్లంగి: ఇది పొడవుగా మరియు సన్నగా ఉంటుంది, పచ్చ రంగు చారలతో ఉంటుంది. ఇది చాలా పదునైన రుచిని కలిగి ఉంటుంది.
నల్ల ముల్లంగి: ఇది నల్లటి చర్మంతో ఉంటుంది మరియు తెల్లటి మాంసాన్ని కలిగి ఉంటుంది. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది.
అయితే ఈ ముల్లంగిని కొన్ని ఆహారపదార్థాలతో కలిపి తీసుకోకుండా ఉండాలి. లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. వీటికి మీరు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
పాలు
పాలు, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా పాలు తీసుకోవడం వల్ల గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ముల్లంగి , పాలను ఎట్టి పరిస్థితిలో కలిపి తీసుకోకుండా ఉండాలి.
పెరుగు
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోడం వల్ల అనారోగ్య సమస్యలను కలిగించే క్రిములు తొలుగుతాయి. అయితే పెరుగును ముల్లంగితో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు కలుగుతాయి.
బెండకాయ
ముల్లంగిని బెండకాయతో అసలు తినకూడదు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది గుండెపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
చీజ్
చీజ్, ముల్లంగితో తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. దీనిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్
ఆహారం చేసిన వెంటనే చాలా మంది పండ్లను తీసుకుంటారు. కానీ ముల్లంగి తీసుకున్న తరువాత ఆరెంజ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్ణం వంటి సమస్యల బారిన పడాల్సిన ఉంటుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి