Ice Cream : వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ముఖ్యంగా బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా వేసవికాలంలో ఐస్ క్రీమ్ డిమాండ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ స్ట్రెస్ బస్టర్ లాగా కూడా అనిపిస్తుంది. కానీ ఐస్ క్రీమ్ తినడం వల్ల కేవలం తీవ్ర నష్టాలు మాత్రమే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే జలుబు చేస్తుందని దగ్గు వస్తుందని అనుకొని దానిని ఎవాయిడ్ చేస్తూ ఉంటారు. అందరూ అనుకుంటున్నట్లు ఐస్ క్రీమ్ తినడం వల్ల నష్టాలు ఉండి ఉండొచ్చు కానీ దానివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. నిజంగానే ఐస్ క్రీమ్ తినడం వల్ల మన శరీరానికి అలాగే ఆరోగ్యానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.
కడుపునిండా తిన్నా కూడా చాలామందికి ఆఖరిలో ఐస్ క్రీమ్ తినే ప్లేస్ ఉంటుందని అంటూ ఉంటారు. అలాంటి ఐస్ క్రీమ్ లో రుచి మాత్రమే కాకుండా కొన్ని పోషక విలువలు కూడా ఉన్నాయి. అయితే ఐస్ క్రీమ్ పూర్తిగా పోషక ఆహారం అని చెప్పలేకపోవచ్చు కానీ ప్రముఖ పోషకాహార నిపుణుడు లారా ఎం అలీ మాత్రం ఐస్ క్రీమ్ లో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఒకవేళ ఐస్ క్రీమ్ నాణ్యంగా ఉంటే దాని తయారీ లో కూడా ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకపోతే కచ్చితంగా ఆ ఐస్ క్రీమ్ లో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయట. ముఖ్యంగా ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎండోర్ఫిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందట. దానివల్ల మనసు బాగుంటుంది. మనకి తెలియకుండానే మనలో సంతోషం వస్తుంది.
అంతేకాకుండా ఐస్ క్రీమ్ తినడం వల్ల మన శరీరంలో క్యాల్షియం సరఫరా కూడా ఎక్కువ అవుతుందట. దీనివల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఐస్ క్రీమ్ తినడం వల్ల మన శరీరంలో శక్తి చాలా వేగంగా పెరుగుతుందట. మామూలు ఆహారంతో పోల్చుకుంటే ఐస్ క్రీమ్ వల్ల మనలో ఎనర్జీ చాలా త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దంతాల కి సంబంధించిన సమస్యల సమయంలో కూడా ఐస్ క్రీం మనకి ఉపయోగపడుతుందట. ముఖ్యంగా దంతాల వెలికితీత తర్వాత ఐస్ క్రీమ్ తింటే ఆ గాయం చాలా త్వరగా మానిపోతుంది అని డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఐస్ క్రీమ్ తినడం చాలా మంచిది అని కూడా చెబుతున్నారు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Benefits of Ice Cream: ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా ఇన్ని లాభాలా.. తెలిస్తే షాక్..