Diabetes Control Tips: మధుమేహం వ్యాధి నియంత్రణ ఎంత సులభమో, నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. ఒకవేళ మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేదంటే..డయాబెటిస్ ప్రమాదకర లక్షణాలు మీలో ఉన్నాయని అర్ధం. ఈ క్రమంలో రాత్రి నిద్రించేముందు కొన్ని చిట్కాలు పాటించాలి.
డయాబెటిస్ అనేది ఒక అపరివర్తన ఆరోగ్య స్థితి. మధుమేహంతో జీవితం సాగించడం చాలా కష్టం. ఇన్సులిన్ ఉత్పత్తి లోపంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఇదొక వ్యాధి. ఈ వ్యాధి లక్షణాల్ని నియంత్రించడంలో, బ్లడ్ షుగర్ నియంత్రించడంలో చాలా పద్ధతులున్నాయి. డయాబెటిస్ ఉన్నప్పుడు రాత్రి నిద్రించే ముందు ఈ నాలుగు పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు వైద్య నిపుణులు.
డయాబెటిస్ రోగుల నిద్రించే సమయం
ఒకవేళ మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే డయాబెటిస్ సంబంధిత ప్రమాదకర లక్షణాలున్నట్టే. రాత్రి నిద్రించేముందు కొన్ని సులభమైన పద్దులు పాటించాల్సి ఉంటుంది. ముందుగా బెడ్ టైమ్ ఒకటే ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటమే కాకుండా..రాత్రి వేళ మంచి నిద్ర పడుతుంది.
క్యామోమైల్ టీ
ఫ్రెష్ క్యామోమిల్ టీ రోజూ నిద్రించేముందు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో దోహదపడుతుంది. క్యామోమిల్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లక్షణాల్ని నియంత్రించడంలో దోహదపడతాయి.
నానబెట్టిన 7 బాదం పిక్కలు
మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే రోజూ రాత్రి వేళ పడుకునే ముందు కనీసం 7 నానబెట్టిన బాదం పిక్కల్ని తినాలి. ఇందులో మెగ్నీషియం, ట్రిప్టోఫోనే ఉంటాయి. దీనివల్ల నిద్రలో గురక తగ్గుతుంది. రాత్రి వేళ ఆకలి నియంత్రణలో ఉంటుంది.
మెంతి గింజలు
మెంతులు లేదా నానబెట్టిన మెంతుల్లో హైపో గ్లైసోమిక్ గుణాలుంటాయి. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
15 నిమిషాలు వజ్రాసనం
డయాబెటిస్ నియంత్రణకు యోగా కూడా మంచి సాధనం. దీనికోసం రాత్రి నిద్రించేముందు ఓ 15 నిమిషాలు వజ్రాసనం వేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
Also read: Dehydration: వేసవిలో మీ బాడీ డీహైడ్రేట్ అవుతోందా, ఈ చిట్కాలతో అద్భుత ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook