Dengue Treatment: డెంగ్యూ సోకిందా, ప్లేట్‌లెట్ కౌంట్ అత్యంత వేగంగా పెంచే ప్రాచీన వైద్య విధానం

Dengue Treatment: వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి పొంచి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే డెంగ్యూ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2024, 07:42 PM IST
Dengue Treatment: డెంగ్యూ సోకిందా, ప్లేట్‌లెట్ కౌంట్ అత్యంత వేగంగా పెంచే ప్రాచీన వైద్య విధానం

Dengue Treatment: డెంగ్యూ వ్యాధి సోకితే ప్రధానంగా ఏర్పడే సమస్య ప్లేట్‌లెట్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. ఇది ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం అల్లోపతి మందుల కంటే వేగంగా పనిచేసేది బొప్పాయి ఆకుల రసం. ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. 

వర్షాకాలంలో సహజంగానే సీజనల్ వ్యాధుల భయం పొంచి ఉంటుంది. దోమల కారణంగా ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి కేసులు పెరుగుతుంటాయి. డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు ఆందోళన కల్గించేది ప్లేట్‌లెట్ సంఖ్య. ఇది గణనీయంగా తగ్గిపోతుంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడి శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య 1 లక్ష నుంచి 4 లక్షల వరకూ ఉండవచ్చు కానీ డెంగ్యూ సోకినప్పుడు ఇది అంతకంతకూ పడిపోతూ ఒక్కోసారి 20 వేలకు దిగువలో కూడా వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఈ క్రమంలో ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత త్వరగా పెంచగలిగితే అంత త్వరగా డెంగ్యూ నుంచి రికవరీ ఉంటుంది. ఇందుకు అద్భుతంగా, దివ్యౌషధంగా పనిచేస్తుంది బొప్పాయి ఆకుల రసం. డెంగ్యూ వ్యాధికి బొప్పాయి ఆకుల రసం రామబాణంలా పనిచేస్తాయి.

బొప్పాయి ఆకుల రసంలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్స్ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే మనిషి విపరీతంగా బలహీనపడిపోతాడు. నిలుచోలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో లేత బొప్పాయి ఆకుల రసం 1-2 టేబుల్ స్పూన్స్ ఉదయం పరగడుపున తీసకుంటే చాలు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎనాల్జెసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాడీ పెయిన్స్, స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తాయి. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. డెంగ్యూ సోకినప్పుడు ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. అందుకే వ్యాధి తీవ్రమౌతుంది. ఇక బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ పైరెటిక్ గుణాలు జ్వరం తగ్గిస్తాయి. డెంగ్యూలో జ్వరంలో తీవ్రంగా ఉంటుంది. 

బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే 24 గంటల్లోనే ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. బొప్పాయి ఆకుల్ని జ్యూస్‌గా చేసుకుని తాగడం బెస్ట్ పద్ధతి. దీనికోసం 2-3 బొప్పాయి ఆకులు బాగా క్లీన్ చేసి మిక్సీ చేయాలి. కొద్దిగా నీళ్లు రుచి కోసం నిమ్మ లేదా తేనె కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. బొప్పాయి ఆకులతో టీ కూడా చేస్తారు కొంతమంది. దీనికోసం 2-3 బొప్పాయి ఆకుల్ని నీళ్లలో మరిగించి కాస్త నిమ్మరసం కలిపి తాగాలి.

అన్నింటికంటే అనాదిగా వాడుకలో ఉన్న మరో విధానం లేత బొప్పాయి ఆకుల్ని తీసుకుని గుడ్డ ముక్కలో వేసి బాగా క్రష్ చేసి రసం తీయాలి. ఇది 1-2 చెంచాల కంటే ఎక్కువ రాదు. ఇది చాలా చేదుగా ఉంటుంది. అయినా నేరుగా తాగేయాలి. ఇలా చేస్తే ప్లేట్‌లెట్ కౌంట్ అత్యంత వేగంగా పెరుగుతుంది. 

Also read: Blood Pressure Control Tips: రోజూ డైట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, రక్తపోటు ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News