Curry Leaf Juice For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గ లేకపోతున్నారు. అయితే శరీర బరువును సులభంగా తగ్గించుకోవడానికి కరివేపాకు జ్యూస్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో బాడీకి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని భారతీయులంతా వంటకాల్లో వినియోగిస్తారు. అయితే ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును తగ్గించడమేకాకుండా మధుమేహాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ కరివేపాకు రసం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కరివేపాకు జ్యూస్ ప్రయోజనాలు:
>> ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు
>>శరీర బరువు అదుపులో ఉంచడానికి కరివేపాకు జ్యూస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
>>వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్‌ను విచ్చల విడిగా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో పెరుకుపోతుంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొండానికి క్రమం తప్పకుండా పడిగడుపును ఈ కరివేపాకు జ్యూస్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
>>మధుమేహంతో బాధపడుతున్నవారికి కరివేపాకు జ్యూస్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.
>> చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు కూడా కరివేపాకు జ్యూస్‌ను తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పై సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook