Vaccine Efficacy: కరోనా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేయడం లేదంటున్న కన్సార్టియం

Vaccine Efficacy: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసు అంటే మూడవ డోసు ఎంతవరకూ అవసరమనే విషయంపై చర్చ నడుస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2021, 12:27 PM IST
Vaccine Efficacy: కరోనా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేయడం లేదంటున్న కన్సార్టియం

Vaccine Efficacy: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసు అంటే మూడవ డోసు ఎంతవరకూ అవసరమనే విషయంపై చర్చ నడుస్తోంది. 

కరోనా మహమ్మారితో(Corona Pandemic) ప్రపంచం విలవిల్లాడుతూనే ఉంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant)ఉధృతి పెరుగుతోంది. దాంతో కరోనా వైరస్ నియంత్రించేందుకు ఇస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో బూస్టర్ డోసు అంటే మూడవ డోసు ఇచ్చే విషయమై చర్చ సాగుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా సరే డెల్టా కేసులు అధికంగా నమోదవుతుండటంతో బూస్టర్ అవసరమనే వాదన వస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక విషయాలు తెలిపారు. 

ఇండియాలో కరోనా బూస్టర్ డోసు(Vaccine Booster Dose) ఇచ్చేందుకు మరింత సమగ్ర సమాచారం అవసరమని డాక్టర్ రణదీప్ గులేరియా (Dr Randeep Guleria)అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది దీనికి  సంబంధించిన సమాచారం సమకూరవచ్చని తెలిపారు. వృద్ధులు, అధిక ప్రమాదం ఉన్నవారి డేటా లేదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎంత వరకూ రక్షణ కలుగుతుందనే సమాచారం కచ్చితంగా అవసరమన్నారు. ఇండియాలో బూస్టర్ డోసు ఇవ్వాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సామర్ధ్యంపై పూర్తి సమాచారం సేకరించిన తరువాతే మూడవ డోసు(Vaccine Third Dose) అవసరమా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా సరే ఇండియాలో డెల్టా కేసులు ఎక్కువవుతున్నాయని ఐఎన్ఎస్ఏసీఏజీ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నిరోదించడంలో వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌వో (WHO)ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకరంగా పేర్కొంది. ఇప్పటికే 11 దేశాల్లో ఉంది. ఇండియా, అమెరికా, బ్రిటన్ పోర్చుగల్ దేశాల్లో ఎక్కువగా ఉన్న ఈ వేరియంట్ మరోసారి విజృంభణకు దోహదపడనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన పరిస్థితి ఉంది. 

Also read: Zycov D Vaccine: ప్రపంచంలో తొలి డీఎన్ఏ..మేకిన్ ఇండియా వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరికి మార్కెట్‌లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News