Corona Twindemic Alert: ప్రపంచానికి ఇక కరోనా ట్విండెమిక్ ముప్పు వెంటాడనుందా

Corona Twindemic Alert: కరోనా మహమ్మారి ఇప్పుడు మరో రకంగా భయపెడుతోంది. కరోనా రోగంతో పాటు సీజనల్ వ్యాధుల భయం పట్టుకోవడంతో జనం ఆందోళనం చెందుతున్నారు. కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా అనే భయం వెంటాడుతోంది. అసలీ ట్విండెమిక్ అంటే ఏంటి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2021, 06:04 AM IST
  • ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా ట్విండెమిక్
  • ఫ్లూ వ్యాధులతో పాటు కరోనా సంక్రమణ కలిపి ట్విండెమిక్‌గా మారుతుందన్న భయం
  • రష్యాలో పెరుగుతున్న కరోనా మరణాలు
Corona Twindemic Alert: ప్రపంచానికి ఇక కరోనా ట్విండెమిక్ ముప్పు వెంటాడనుందా

Corona Twindemic Alert: కరోనా మహమ్మారి ఇప్పుడు మరో రకంగా భయపెడుతోంది. కరోనా రోగంతో పాటు సీజనల్ వ్యాధుల భయం పట్టుకోవడంతో జనం ఆందోళనం చెందుతున్నారు. కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా అనే భయం వెంటాడుతోంది. అసలీ ట్విండెమిక్ అంటే ఏంటి

కరోనా సంక్రమణ(Corona Spread)ప్రపంచమంతటా ఇంకా ప్రతాపం చూపిస్తూనే ఉంది. కరోనా ప్రారంభమయ్యాక మరో చలికాలం వచ్చేస్తోంది ఇండియాలో. అమెరికాలో అప్పుడే రెండవ సీజన్‌లో ప్రవేశించింది. కరోనా వైరస్‌తో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ కూడా వెంటాడుతోంది. ప్రస్తుతం కరోనా పాండెమిక్‌గా ఉంది. సీజనల్ వ్యాధిగా ఉన్న ఫ్లూతో కలిపి ట్విండెమిక్‌గా(Corona Twindemic)మారుతుందనే భయం వెంటాడుతోంది. ఇది కచ్చితంగా ఆందోళన కల్గించే పరిణామమే. అదే ఇప్పుడు అమెరికాలో భయానికి కారణమవుతోంది. ఏది కరోనా ఏది ఫ్లూ తెలియక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో యూఎస్ వైద్య నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కరోనాకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని తెలుస్తోంది. ఇక యూకేలో ఇప్పటి వరకూ 20 లక్షలమందికి కరోనా బూస్టర్ డోసు(Corona Booster Dose)ఇచ్చారు. కోవిడ్ నుంచి అత్యధిక ముప్పున్న వర్గాల్ని ఎంపిక చేసి..వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. మరోవైపు రష్యాలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రష్యాలో 968 మంది కోవిడ్ కారణంగా మరణించారు. అటు 29 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటి వరకూ 6 లక్షలమంది మరణించారు. డెల్టా వైరస్ ప్రపంచదేశాల్లో క్రమక్రమంగా విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది. 

ఇక ఇండియాలో కొత్తగా 19 వేల 740 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 39 లక్షల 35 వేల 309కు చేరుకుంది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 36 వేల 643గా ఉంది. గత 206 రోజుల్లో ఇదే అత్యంత తక్కువ సంఖ్య. దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఇప్పటి వరకూ 3 కోట్ల 32 లక్షల 48 వేల 291కు చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.98 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 94.62 కోట్లమందికి  కరోనా వ్యాక్సిన్ అందించారు. ఇండియాకు ప్రపంచం నలుమూలల్నించీ వ్యాక్సిన్(Vaccination)తయారీ ముడి పదార్ధాల సరఫరా కొనసాగాలని యూఎన్ఓ భారత రాయబారి కోరారు. 

Also read: World Egg Day: గుడ్డుతో కలిపి ఏయే వస్తువులు తినడం మంచిది కాదో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News