Coconut Water Benefits: కొబ్బరి నీరు శరీరానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు ఈ నీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ కొబ్బరి నీటిని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరానికి రెట్టింపు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా శరీర బరువు కూడా సులభంగా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి. ఆ లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి..
కొబ్బరి నీళ్లలో బయోయాక్టివ్ ఎంజైమ్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది:
కొబ్బరి నీళ్లలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా మోతాదులో లభిస్తాయి. దీంతో పాటు ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల శరీరం చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా అలసట, నీరసం, బలహీనత, తల తిరగడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది:
శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కొబ్బరి నీరు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజూ ఉదయాన్నే పరగడుపున కొబ్బరినీళ్లు తాగితే..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
హైబీపీతో బాధపడుతున్నారా?:
కొబ్బరి నీటిలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి