Cholesterol Lowering Drinks: ప్రస్తుతం వేసవి కాలం వెళ్లి వానా కలం వచ్చింది. వాతావరణంలో తేమ వల్ల శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. కావున ఎండ కాలంలో లాగే వాన కాలంలో శరీరానికి హైడ్రేట్‌గా ఉంచుకోవమం చాలా మంచిది. శరీరం హైడ్రేడ్‌గా ఉండానికి మార్కెట్ లభించే చాలా రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఉత్పత్తులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతున్నాయి. అయితే కొవ్వు పెరగ కుండా శరీరాన్ని ఎలా హైడ్రేడ్‌గా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయిల్ ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి:
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఆయిల్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా.. ఫైబర్ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం లభించే కొన్ని ఉత్పత్తుల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలను దూరం చేయవచ్చని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ టీ (Green Tea):
గ్రీన్ టీలో కాటెచిన్స్, ఎపిగాల్లోకా, టెచిన్, గాలేట్ అనే మూలకాలు ఉంటాయి. అంతేకాకుడా యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తాగితే .. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఓట్స్ మిల్క్ (Oats Milk):
అల్పాహారంలో ఓట్స్ మిల్క్ తిసుకోవడం చాలా మేలు. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే బీటా-గ్లూకాన్ మూలకాలు బైల్ సాల్ట్‌తో కలిసి పేగులలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
టమాటో జ్యూస్:
టమాటోలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని జ్యూస్‌లాగా చేసుకుని తాగడం వల్ల శరీరాని మంచి లాభాలు చేకూరుతాయి. ఇందులో ఉండే పీచు అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
సోయా మిల్క్(Soy Milk)
సోయా మిల్క్‌లో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం ఉంటుంది. కావున ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తాగితే చాలా రకాల శరీరానికి ప్రయోజనాల కలుగుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!
Also Read: Jamun Side Effects: నేరేడు పళ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి, లేకపోతే మీకే నష్టం!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.