Cervical Pain Treatment: ప్రస్తుతం చాలా మంది స్త్రీలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ చూపకపోవడం, మారుతున్న జీవన శైలి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు మెడ చుట్టుపక్కల భాగాలలో విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల కారణంగా సాధారణ జీవితం గడపడానికి సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఫిజియోథెరపీ, వ్యాయామం వంటి పద్ధతులను వినియోగించవచ్చు. అంతేకాకుండా ఆయుర్వేదంలో పేర్కొన్న చిట్కాల ద్వారా కూడా విముక్తి పొందవచ్చు.
నొప్పి నుంచి విముక్తి పొందడాని వీటిని వాడండి:
1. ఆముదం నూనె(Castor oil):
ఆముదం నూనె మెడ నొప్పికి దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో ఈ నూనె గొప్ప దివౌషధంగా భావిస్తారు. కావున ఈ నూనెతో మెడకు రెగ్యులర్ గా మసాజ్ చేస్తే సమస్య దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
2. నువ్వుల నూనె(Sesame oil)
చాలా మంది ప్రస్తుతం కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఉండే గుణాలు మెడ నొప్పులను కూడా దూరం చేస్తుంది. కావున ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నూనె వినియోగించాని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
ఇవి కూడా ఈ నొప్పికి ప్రభావవంతంగా పని చేస్తాయి:
వెల్లుల్లి(Garlic)
మెడ నొప్పులతో బాధపడుతుంటే.. వెల్లుల్లి మొగ్గలన తినమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని కోసం వెల్లుల్లిని మెత్తని మిశ్రమంలా చేసి.. ఆవాల నూనెలో కలిపి, నొప్పి ప్రాంతాల్లో రాసి మసాజ్ చేయండి.
అశ్వగంధ(Ashwagandha)
అశ్వగంధను రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు నొప్పులపై ప్రభావవంతంగా పని చేస్తాయి. దీని కోసం అశ్వగంధ పొడిని గోరువెచ్చని నీటితో లేదా పాలలో కలుపుకుని తాగండి. నొప్పుల సమస్యలన్నీ దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook