Curd For Diabetes Patients: షుగర్ పేషెంట్స్ పెరుగు తినొచ్చా ? తింటే ఏమవుద్ది ?

Curd For Diabetes Patients: ఏం తింటే ఏం అవుద్దో అనే భయం డయాబెటిస్ పేషెంట్స్‌ని వెంటాడుతుంటుంది. డయాబెటిస్ పేషెంట్స్‌ని అలా అయోమయానికి గురిచేసే వాటిలో పెరుగు కూడా ఒకటి. ఇంతకీ షుగర్ పేషెంట్స్‌కి పెరుగు మేలు చేస్తుందా లేక హానీ చేస్తుందా అనే ప్రశ్నలకు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 07:46 PM IST
Curd For Diabetes Patients: షుగర్ పేషెంట్స్ పెరుగు తినొచ్చా ? తింటే ఏమవుద్ది ?

Curd For Diabetes Patients: డయాబెటిస్.. యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బుల జాబితాలో మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు ఎక్కువగా ఉంటే.. అందులో ముందు వరుసలో ఉండేది మధుమేహమే. ఒక్కసారి మధుమేహం బారినపడ్డాకా.. రోజూ తినే ఆహారం, లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయిద్ది. అప్పటివరకు ఏ షరతులు లేకుండా ఎంజాయ్ చేసిన లైఫ్ స్టైల్లోకి ఉన్నట్టుండి ఒక్కసారిగా అది తినొద్దు.. ఇది తినొద్దు అంటే చేంతాడంత చిట్టా షుగర్ పేషెంట్స్ ముందర పెడుతుంటారు. దీంతో ఏం తింటే ఏం అవుద్దో అనే భయం డయాబెటిస్ పేషెంట్స్‌ని వెంటాడుతుంటుంది. డయాబెటిస్ పేషెంట్స్ ని అలా అయోమయానికి గురిచేసే వాటిలో పెరుగు కూడా ఒకటి.

డయాబెటిస్ పేషెంట్స్ పెరుగు తినొచ్చా ? లేదా అనే సందేహాల కంటే ముందుగా.. సాధారణంగా పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.  
పెరుగుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : 
వేడిచేసిన పాలను బ్యాక్టీరియాతో పులియబెట్టడం ద్వారా పెరుగు తయారవుతుంది అనే విషయం తెలిసిందే. పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్క గ్రాము పెరుగులో సాధారణంగా 100 మిలియన్ల సంఖ్యలో లైవ్ బ్యాక్టీరియా ఉంటుందని చెబుతుంటారు. పైగా ఇది సహజ సిద్ధంగా తయారయ్యే ప్రోబయోటిక్ ఫుడ్ కూడా కాబట్టి ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఆహారం జీర్ణం అవడంలో సహాయపడి పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం, పెరుగులో ప్రోటీన్ 3.5 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 4.7 గ్రాములు, చక్కెర 4.7 గ్రాములు ఉంటాయి. ఇవేకాకుండా పెరుగు ద్వారా ఒంటికి విటమిన్ బి 12, కాల్షియం, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పెరుగులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కలగలిసి ఉన్న పెరుగు హెల్తీ ఫుడ్స్ లో ఒకటిగా పేరొందింది. కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరుగు మంచి ఆహారమే అవుతుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించే సామర్థ్యం పెరుగు సొంతం. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి కనుక ఎముకలు, దంతాలు ధృడంగా ఉండటానికి పెరుగు మేలు చేస్తుంది. ప్రోబయోటిక్ పెరుగు మీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ ప్రోబయోటిక్ కర్డ్ మరింత మంచిది.

ఏయే సమయంలో పెరుగు తింటే ఆరోగ్యానికి మంచిది
రాత్రి వేళ పెరుగు తింటే కఫం తయారవుతుంది. అలాగే ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ నశించి ఎసిడిటీ సమస్యలను దారి తీస్తుంది. అందుకే పొద్దున్నే ఖాళీ కడుపుతో, అలాగే రాత్రి వేళ పెరుగు తినడం సరికాదు. మధ్యాహ్నం పూట కానీ లేదా ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా ఆహారం తీసుకున్న తరువాత పెరుగు తినొచ్చు.

Trending News