Boost Your Metabolism In 10 Days: ప్రస్తుతం చాలా మందిలో అలసట, బద్ధకం సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా వీరు బలహీనతకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారం అనారోగ్యకరంగా ఉండడం. ఈ సమస్య వల్లే జీవక్రియ బలహీనంగా మారుతోంది. దీంతో శరీర శక్తి కూడా తగ్గుతుంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో తప్పకుండా పోషకాలున్నాఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జీవక్రియను పెంచడానికి ఈ ఆహారాలను తీసుకోండి:
అల్లం:
అల్లం శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు బాడీ పెయిన్‌ని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా దీనిని రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆకుపచ్చని కూరగాయలు:
ఆకుపచ్చని కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్, క్యాల్షియం, పొటాషియం, బి విటమిన్లు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం దృఢంగా తయారుకావడమేకాకుండా మెటబాలిజం స్ట్రాంగ్‌గా అవుతుంది. వ్యాధులు కూడా సులభంగా తగ్గుతాయి.
కాఫీ:
కాఫీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలోని నీరసం, అలసట తొలగిపోతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె శరీరాన్ని చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో శరీరానికి కావాల్సి మంచి కొవ్వులు లభిస్తాయి. అయితే వీటితో తయారు చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం దృఢంగా తయారవుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook