Best Food For Thyroid Weight Loss: థైరాయిడ్ సమస్య ఉన్న వారు తరచుగా బరువు పెరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో థైరాయిడ్ గ్రంధి చాలా తక్కువ మొత్తంలొ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి హైపోథైరాయిడిజం సమస్య వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. థైరాయిడ్ శరీరంలో ఎక్కువ పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే బరువు సులభంగా తగ్గుతారు. ఇలా ఒక్క సారిగా బరువు తగ్గడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అయితే ఈ సమస్యలు థైరాయిడ్ ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు.
ప్రస్తుతం చాలా మందిలో ఊబకాయం, అలసట, జలుబు, మలబద్ధకం సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చర్మం పొడిబారడం, ముఖం వాపు, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం, కీళ్ల దృఢత్వం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్ కూడా ఉంది.
థైరాయిడ్ వల్ల బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి థైరాయిడ్‌తో బాధపడేవారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి పలు రకాల డైట్స్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పలు రకాల మార్పలు చేర్పులు చేయాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఆహారంలో సెలీనియం, జింక్, అయోడిన్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
గింజలు:
గింజల్లో శరీరానికి కావాల్సిన సెలీనియం, జింక్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ బాధితులకు శరీర బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది.
పప్పులు, బీన్స్:
శరీరానికి ప్రోటీన్ అందిచడానికి పప్పులు, బీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే థైరాయిడ్ బాధితులు వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుడ్లు:
గుడ్లలో జింక్, సెలీనియం అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో కూడా వీటిని డైట్స్‌లో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి