Health Benefits Of Carrots: కరోనా వ్యాప్తి సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తాజాగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినాలని చెబుతున్నారు. రోగ నిరోధకశక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి. మీరు ఎంతో ఇష్టంగా తినే దుంప కావడం ప్లస్ పాయింట్. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కోవిడ్19 సోకిన తక్కువ రోజుల్లోనే కోలుకుంటున్నారు.
క్యారెట్ తింటే మీకు సోడియం లభిస్తుంది. తద్వరా రక్తపోటు సమస్యలు మీ దరిచేరవు. కొన్ని రకాల క్యానర్ కారకాలను క్యారెట్ నశింపచేస్తుంది. ఇందులో విటమన్ ఏ (Vitamin A) ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం ద్వారా రోగనిరోధక శక్తి లభించడంతో పాటు మీ చర్మం మరికొంత కాలం యవ్వనంగా ఉంటుంది. కొందరు క్యారెట్లను మామూలుగా తింటారు. మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. క్యారెట్లతో రుచికరమైన వంటలు చేయడం తెలిసిందే. ముఖ్యంగా క్యారెట్లను ఉదయం వేళ పరగడుపున (Empty Stomach) తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు మీకు లభిస్తాయి.
Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్ మరణాలు అధికం, సర్వేలో వెల్లడి
క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలు (Health Benefits Of Carrots):
- ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. కోవిడ్19 వ్యాప్తి సమయంలో క్యారెట్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
- క్యారెట్ తినడం, క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా సోడియం లభిస్తుంది. ఆ సోడియం అధిక రక్తపోటు (High Blood Pressure)ను నియంత్రిస్తుంది. తద్వారా మీరు గుండెజబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
- క్యారెట్లో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టును పొడిబారకుండా సంరక్షిస్తాయి.
- ఆహారం తింటే త్వరగా జీర్ణం కానివారు క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటే జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.
Also Read: Delta Variant of Covid-19: రోగ నిరోధకశక్తికి అందని డెల్టా వేరియంట్, అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- చర్మ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. రోజూ క్యారెట్ తినడం గానీ, లేదా జ్యూస్ తాగినా ప్రయోజనం ఉంటుంది. ముఖాన్ని త్వరగా ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది.
- మీరు రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది. త్వరగా మీరు కళ్లద్దాలు వాడే పరిస్థితి రాకుండా నియంత్రిస్తుంది.
- క్యారెట్ తినడం ద్వారా మన ఒంట్లోని కొవ్వు కరిగిస్తుంది. దీంతో మీరు మరింత చురుకుగా పనులు చేసుకోవడంలో దోహదం చేస్తుంది.
Also Read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook