Facial Glow: ఫేషియల్ చేసుకోకుండా ఫేషియల్ గ్లో.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

Facial Glow without Facial: వయసుతో పని లేకుండ పెద్ద వయసు నుంచి చిన్న వయసు కలవారికి కూడా చర్మం మీద ముడతలు రావడం ప్రస్తుతం సాధారణమైపోతోంది. అంతేకాకుండా యువత ఫేషియల్స్ కి మక్కువ చూపియ్యడం వల్ల చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని పోగొట్టి మనకు తెలిసిన.. మనకు అందుబాటులో ఉన్న సాధారణమైన వస్తువులను ఉపయోగించి మన చర్మాన్ని ఏ విధంగా నిగనిగలాడేలా ఉంచుకోవచ్చు తెలుసుకుందాం

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 03:46 PM IST
Facial Glow: ఫేషియల్ చేసుకోకుండా ఫేషియల్ గ్లో.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

Beauty Tips:

సహజంగా అమ్మాయిలు అందంగా కనిపించాలని. తమ మొహం మెరిసిపోవాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత యువత ఎక్కువగా ఫేషియల్స్ వైపు మక్కువ చూపిస్తున్నారు. కానీ ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ కి హానిరావడం ఖాయమని కొంతమంది నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఫేషియల్ క్రీమ్స్ లో ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల లాంగ్ రన్ లో ఆ క్రీములు మొహాన్ని డామేజ్ చేయొచ్చు. అయితే ఫేషియల్ లేకుండా మొహం మెరుస్తూ ఉండడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి.. మరి అవేవో ఒకసారి చూద్దాం

సహజ సిద్ధంగా గ్లో పొందడం కోసం గులాబీ ఆకులను గ్రైండ్ చేసి మొహానికి రాసుకున్నట్టయితే మొహం తేమగా ఉంటుంది. ఇది మొహానికి గులాబీ రంగును ఇస్తుంది. అలాగే మొహం పై రోజ్ వాటర్ ను స్ప్రే చేసుకుంటే కూడా చర్మాన్ని పొడి కాకుండా తేమగా ఉంచుతుంది ఇలా ఉంచడం వల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఫేషియల్ ముందు త్యాన్ ప్యాక్ ఎలా వేసుకుంటామో.. అలా ఇది ఉపయోగపడుతుంది.

మొహంపై బుగ్గల పై తేనె రాసుకుంటే కూడా మొహం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చిపాలలో తేనెను కలిపి మొహానికి రాసుకుంటే మీ చర్మం బంగారంలా మెరిసేలా చేస్తుంది. గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎంతలా మీ మొహం మెరుస్తుందో.. ఇది ఫాలో అయిన అంతలానే మెరుస్తుంది.

పంచదార.. కొబ్బరి నూనె.. కాఫీ పొడితో కలిపి మొహానికి పట్టించి కాసేపు అలాగే ఉంచుకొని చల్లని నీళ్ళతో మొహాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మొహం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఫేస్ ప్యాక్ ఇచ్చే లుక్ ఈ సహజ సిద్ధమైన ప్యాక్ ఈజీగా ఇస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఇవి ఫాలో అయ్యి చూడండి. ఫేషియల్ లేకుండానే ఫేషియల్ గ్లో మీ సొంతం అవుతుంది. 

Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

Also Read:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News