Joint Pain: మినుము పిండితో తయారు చేసిన రోటీలతో శాశ్వతంగా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు..

Bajra Roti For Joint Pain: క్రమం తప్పకుండా మినుములతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చలి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 05:49 PM IST
 Joint Pain: మినుము పిండితో తయారు చేసిన రోటీలతో శాశ్వతంగా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు..

Bajra Roti For Joint Pain: చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా బలహీనపడుతుంది. దీని కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మందిలో జలుబు, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణం సమస్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమ్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాయింట్‌ పెయిన్‌ సమస్యలతో బాధపడుతున్నవారు మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

 మినుము పిండి ఆహారాలతో ఈ సమస్యలకు చెక్‌:

1. మినుము సాగు చేసే క్రమంలో చాలా మంది యూరియా వంటి రసాయనాలు అవసరం లేకుండా సాగు చేస్తారు. అయితే దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా  100 గ్రాముల మినుములలో 67.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో పొటాషియం, అమైనో ఆమ్లాలు, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. మినుములతో తయారు చేసిన రోటీని క్రమం తప్పకుండా తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని ప్రతి రోజూ తీసుకుంటే  గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతో గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకైతే రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది.

3. బియ్యం, గోధుమలతో పోల్చినట్లయితే మినుములు శరీరానికి 5 రెట్లు ఎక్కువ పోషకాలను అందిస్తాయి. అంతేకాకుండా ఇందులో  కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఎముకల సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Kriti Sanon Pics: ఓ మై గాడ్ అనిపిస్తున్న సీత అందాలు.. ఆలస్యం చేయకుండా హాట్ స్టిల్స్ చూసేయండి!

Also Read: waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News