Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!

Amazing Benefits Of Papaya For Healthy Hair: If You want hair like Deepika Padukone just Apply Papaya Hair Mask this way. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె లాగా స్మూత్ మరియు మెరిసే జుట్టు మీ సొంతం కావాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోద్ది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 4, 2023, 03:43 PM IST
  • బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే
  • దీపికా పదుకొనెలా మెరిసే జుట్టు మీ సొంతం
  • బొప్పాయి హెయిర్ మాస్క్ తయారు చేసే విధానం
Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!

Amazing Benefits Of Papaya For Healthy Hair: 'బొప్పాయి' పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఉంటాయి. బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరే పండులోనూ లేవని వైద్యులు చెబుతారు. ఈ పండును తరచుగా ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. బొప్పాయి మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ జుట్టుకు మేలు చేస్తుంది. బొప్పాయిలోని విటమిన్ ఎ మీ జుట్టు యొక్క మూలాల్లో సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె లాగా స్మూత్ మరియు మెరిసే జుట్టు మీ సొంతం కావాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోద్ది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

జట్టుకు 'బొప్పాయి హెయిర్ మాస్క్‌' బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ మాస్క్‌ను అరటి పండు మరియు కొబ్బరి నూనె సాయంతో తయారుచేస్తారు. అరటి పండును ఉపయోగించడం వల్ల హెయిర్ చివర్లు చిట్లకుండా ఉంటాయి. అంతేకాదు మీ జుట్టు స్మూత్‌గా మరియు షైనీగా మారుతుంది. కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది. ఈ నేపథ్యంలో బొప్పాయి హెయిర్ మాస్క్‌ను తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. 

బొప్పాయి హెయిర్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
బొప్పాయి 1 గిన్నె
అరటి పండ్లు 2
1 క్యాప్సూల్ విటమిన్ ఇ 
కొబ్బరి నూనె 4-5 టీస్పూన్లు

బొప్పాయి హెయిర్ మాస్క్ తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో బొప్పాయి పండును తీసుకోండి. అందులో 2 అరటిపండ్లు వేసి రెండింటినీ బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో 4-5 స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. ఒక విటమిన్-ఇ క్యాప్సూల్‌ను కూడా అందులో వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

బొప్పాయి హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి:
బొప్పాయి హెయిర్ మాస్క్ వేసుకునే ముందు మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి. బ్రష్ సహాయంతో జుట్టు మొత్తం అప్లై చేయండి. ఆపై కనీసం 40-50 నిమిషాలు అలానే ఉండాలి. అనంతరం తేలికపాటి షాంపూ లేదా  కండీషనర్ సహాయంతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.మీరు ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 1 లేదా 2 సార్లు ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే దీపికా పదుకొనె లాగా స్మూత్ మరియు మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. 

Also Read: Best Mircro SUV Cars: టాటా పంచ్ కంటే ఈ మైక్రో ఎస్​యూవీ కార్ అదుర్స్.. 6 మంది కూర్చోవచ్చు! ధర 6.18 లక్షలు మాత్రమే  

Also Read: Mercury Transit 2023: అరుదైన భద్రరాజ యోగం 2023.. ఈ 4 రాశుల వారు త్వరలో కుబేరులు అవ్వడం పక్కా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News