టాలీవుడ్ టాక్: మహేష్ మూవీలో విజయశాంతి ?

                      

Last Updated : Mar 14, 2019, 10:00 PM IST
టాలీవుడ్ టాక్: మహేష్ మూవీలో విజయశాంతి ?

అనిల్ రావిపూడి డైరక్షన్ మహేష్ బాబు సరికొత్త మూవీ తెరపైకి వస్తోంది. ఈ కాంబినేషన్ లో తెరపైకి వస్తున్న ఈ  సినిమా జూలై నుండి సెట్స్ పైకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ మహేష్ సరనన ఇద్దరు హీరోయిన్లు ఎంపిక చేసినట్లు తెలిసింది.

అయితే ఈ మాట పక్కనపెడితే ఈ మూవీ కోసం ఎవరూ ఊహించని రీతిలో  సీనియర్ హీరోయిన్ ను తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది. ఈ టాక్ తో అప్పటి వరకు ఫ్యాన్స్ మైండ్ లో హీరోయిన్ ఎవరా…? అని రేజ్ అయి ఉన్న క్వశ్చన్ కాస్త అటకెక్కేసింది. 

ఇలా వార్త హల్ చల్ చేస్తున్న సయయంలో ఈ సినిమాలో విజయశాంతి కీ రోల్ ప్లే చేస్తుందనే టాక్ ఒకటి బయటికొచ్చింది. దీంతో ఫోకస్ మొత్తం ఈ రాములమ్మ పైనే ఉంది. ఒక వేళ రాములమ్మ రంగంలోకి దిగితే ఆమెకు ఎలాంటి రోల్ ఇస్తారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది

గతంలో వీళ్ళిద్దరూ ‘కొడుకు దిద్దిన కాపురం’ లో తల్లీ కొడుకుల్లా నటించిన విషయం తెలసిందే.  మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా ఈ సినిమాతో  స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్నమాట. ఎప్పుడో 2006 లో ‘నాయుడమ్మ’ లో కనిపించిన విజయశాంతి మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 

మహేశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. అయితే రాములమ్మ రీ ఎంట్రీపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. రేపో మాపో అన్ని డీటేల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
 

Trending News