ఆపరేషన్ 2019.. వందేమాతరం లిరికల్ సాంగ్..

ఆపరేషన్ 2019 సినిమా నుంచి వందేమాతరం లిరికల్ సాంగ్..

Last Updated : Nov 4, 2018, 04:08 PM IST
ఆపరేషన్ 2019.. వందేమాతరం లిరికల్ సాంగ్..

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఆపరేషన్ 2019 సినిమా నుంచి మేకర్స్ వందేమాతరం లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ రచించిన ఈ గేయానికి ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందించాడు. అరవింద సమేత సినిమాలో పెనిమిటి సాంగ్ పాడిన ప్రముఖ సింగర్ కాలబైరవ ఈ పాటను పాడారు. ఆపరేషన్ 2019.. బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణం బాబ్జి డైరెక్ట్ చేస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా.. దేశంలో ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనే విషయాన్ని చాటిచెప్పేలా ఈ పాట బ్యాక్ డ్రాప్‌లో విజువల్స్ చూపించడం చూస్తోంటే, ఈ సినిమా ఆపరేషన్ దుర్యోధన లాగే రాజకీయ చైతన్యం కలిగించే చిత్రం అవుతుందేమో అనిపిస్తోంది.

Trending News