సైరా నటుడిపై కత్తి మహేష్ ప్రశంసల వర్షం

తమిళ నటుడు విజయ సేతుపతిపై ప్రముఖ విమర్శకుడు కత్తి మహేష్ పొగడ్తల వర్షం కురిపించారు. 

Last Updated : Oct 19, 2018, 06:34 PM IST
సైరా నటుడిపై కత్తి మహేష్ ప్రశంసల వర్షం

తమిళ నటుడు విజయ సేతుపతిపై ప్రముఖ విమర్శకుడు కత్తి మహేష్ పొగడ్తల వర్షం కురిపించారు. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రం విడుదల సందర్భంగా కత్తి మహేష్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా హిట్ అయిన సందర్భంగా తన భావాలను  ఫేస్బుక్ పోస్టు ద్వారా పంచుకున్నారు. " నమ్మిన స్క్రిప్టు కోసం ఒక హీరో ఏమి చేయగలడు అనడానికి విజయ్ సేతుపతిని మించిన ఉదాహరణ ఉంటుందా..? అనిపిస్తుంది. 96 సినిమా స్క్రిప్ట్ విన్నాక. రచయిత, సినిమాటోగ్రఫర్ అయిన ప్రేమ్ కుమార్‌ని కథ చాలా  బాగుంది. నువ్వు చెప్పినట్టు మరొకరు తియ్యలేరు. కాబట్టి నువ్వే డైరెక్టర్‌గా ఉండు. అని ఒకర్ని దర్శకుడిని చేయగలడు. నిర్మాతకు చెప్పి ఒప్పించగలడు. రెండు సంవత్సరాల పాటు సినిమా కొనసాగినా కమిటెడ్‌గా షూటింగ్ చేయగలడు.

తన మార్కెట్ వాల్యూ 5 నుంచి 7  కోట్ల మధ్య ఉన్నా.. సినిమా కోసం కేవలం 3 కోట్ల రెమ్యునరేషన్‌తో సరిపెట్టుకోగలడు.  రిలీజ్ చేయడానికి నిర్మాతకు ఫైనాన్సర్లు అడ్డు తగులుతుంటే 4 కోట్ల (తన రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ)కు ష్యురిటీ సంతకం పెట్టి సినిమాను రిలీజ్ చేయగలడు. ఇంత కమిట్మెంట్  ఉంది కాబట్టే, అంత గౌరవం సంపాదించుకున్నాడు. ఎదురుగా పొగిడి పక్కకెళ్లి తిట్టుకునే గౌరవం కాదు. నిజంగా నిజమైన గౌరవం. రెస్పెక్ట్ టూ విజయ్ సేతుపతి!!!" అని కత్తి మహేష్ వ్యాఖ్యలు చేశారు.

ధర్మదురై, విక్రమ్ వేదా, జుంగా, కవన్, ఇరైవి, నవాబ్ లాంటి తమిళ చిత్రాలలో తనదైన శైలిలో నటించిన విజయ్ సేతుపతి.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ''పెట్టా" చిత్రానికి కూడా విజయ్ సైన్ చేశారు. విజయ్ నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్‌గా, డైలాగ్ రైటర్‌గా, పాటల రచయితగా కూడా వ్యవహరించారు. గతంలో పెన్ అనే టీవీ సీరియల్‌లో నటుడిగా బుల్లితెరకు పరిచయమైన విజయ్.. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తాను చాటారు.

Trending News