Taapsee Pannu: ఫోటోగ్రాఫర్లతో తాప్సీ పన్ను గొడవ.. చివర్లో ఎవరూ ఊహించని పని.. వీడియో వైరల్!

Taapsee Pannu Argument With Paparazzi: ఫోటోగ్రాఫర్లతో తాప్సీ పన్ను గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆమె చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 02:45 PM IST
Taapsee Pannu: ఫోటోగ్రాఫర్లతో తాప్సీ పన్ను  గొడవ.. చివర్లో ఎవరూ ఊహించని పని.. వీడియో వైరల్!

Taapsee Pannu Argument With Paparazzi: తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా మారిన తాప్సీ పన్ను ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేస్తోంది. అక్కడ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆమె దూసుకుపోతోంది. తాప్సీ పన్ను నటించిన దొబారా త్వరలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్‌స్లో తాప్సీ బిజీగా ఉంది. సోమవారం సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన తాప్సీ పన్ను ఆమెను కవర్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లతో గొడవకు దిగింది. అలా అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తన సినిమా ప్రచారం కోసం తాప్సీ పన్ను ముంబైలోని మిథిబాయి కాలేజీకి చేరుకుంది.

అయితే నిజానికి తాప్సీ తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు చెప్పిన సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లు ఆమె కోసం చాలా సేపు వేచి ఉన్నారు. అయితే ఆమె ఆలస్యంగా రావడమే ఫోటోలు ఇవ్వడానికి నిరాకరించినట్టు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లు కొంత నసుగుతూ ఫోటోలు ఇవ్వమని గట్టిగా కోరడంతో తాప్సీ పన్నూ రెచ్చిపోయింది. ఇక వైరల్ అవుతున్న వీడియోలో వేదిక వద్దకు వచ్చిన వెంటనే తాప్సీ ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా లోపలికి వెళ్లడం చూడచ్చు. ఫోటోగ్రాఫర్లు తాప్సీని వెనుక నుండి పిలుస్తూ ఫోటోల కోసం ఆపారు. తాప్సీ మేడం, రెండు నిమిషాలు ఆగండి, మీ కోసం ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం అని వారు అడగడం అలాగే నువ్వు ఆలస్యం అయ్యావు అని అనడంతో ఆమెకు కోపం వచ్చింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

తాప్సీ మాట్లాడుతూ – ఎందుకు అరుస్తున్నావు? నా తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు. నేను వెళ్ళాలి లోపల ఆలస్యం అవుతోందని అంటే దానికి ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ సాయంత్రం 4.30 గంటల నుంచి మేము కూడా మీ కోసం వెయిట్ చేస్తున్నామని పేర్కొనడంతో  తాప్సీ పన్ను ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగింది. ఆమె ఫోటోగ్రాఫర్లతో, అసలు 'మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు? ఇందులో నా తప్పేంటి? నన్ను రమ్మన్న టైంకే నేను వచ్చానని చెప్పడం కనిపిస్తోంది. తనతో మర్యాదగా మాట్లాడమని, అప్పుడే తాను కూడా మర్యాదగా మాట్లాడతానని ఫోటోగ్రాఫర్‌లతో పేర్కొంది. పరిస్థితి ఇబ్బందికరంగా మారేలా ఉండడంతో కొందరు ఫోటోగ్రాఫర్లు జోక్యం చేసుకుని సమస్యను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

కానీ తాప్సీ ఒక ఫోటోగ్రాఫర్ తనతో మర్యాదపూర్వకంగా మాట్లాడలేదని చెప్పింది. ఇక అయినా వారు వినకుండా చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నామని అంటూ ఉండటంతో తాప్సీ పన్ను ఫోటోగ్రాఫర్లకు చేతులు జోడించి, 'మీరు ఎప్పుడూ కరెక్టే, యాక్టర్స్ ఎప్పుడూ తప్పు' అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తాప్సీ పన్నుకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది ఫోటోగ్రాఫర్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొందరు తాప్సీ పన్నుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే, తాప్సీ పన్ను ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగడం ఇదే మొదటి సారి, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇక ఆమె నటించిన 'దొబారా' సినిమా ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'దోబారా' స్పానిష్ చిత్రం 'మిరాజ్'కి రీమేక్ గా రూపొందింది. 

Also Read: Pradeep Patwardhan: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం!

Also Read: Bigg Boss Telugu Season 6 : ఎదురు చూపులకు బ్రేక్.. ఇక వచ్చేస్తోంది బిగ్ బాస్ 6.. ప్రోమో చూశారా?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News