యూకేలో 'పద్మావతి' డిసెంబర్1 రిలీజ్ ?

యూకేలో డిసెంబర్ 1 వతేదీన పద్మావతి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ అన్ని థియేటర్లలో విజయవంతంగా సినిమా ప్రదర్శించబడుతుంది

Last Updated : Nov 23, 2017, 08:08 PM IST
యూకేలో 'పద్మావతి' డిసెంబర్1 రిలీజ్ ?

కర్ణిసేన నిరసనల నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీన విడుదల కావాల్సిన పద్మావతి సినిమాను భారత్ లో విడుదల నిలిపివేశారు చిత్రయూనిట్. కానీ, అనుకున్న తేదీలో బ్రిటన్ లో రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది. తాజాగా అందిన కొన్ని రిపోర్ట్ ల ప్రకారం.. "యూకేలో డిసెంబర్ 1 వతేదీన పద్మావతి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ అన్ని థియేటర్లలో విజయవంతంగా సినిమా ప్రదర్శించబడుతుంది. 'బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్'  చిత్ర ప్రదర్శనకు అన్ని అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా సినిమా కోసం సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) ను నిర్మాతలు కోరారు. కాని, వారి అభ్యర్థనను సిబిఎఫ్సీ తిరస్కరించింది. క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇస్తామని తెలిపింది.

Trending News